ఎనిమిది సార్లు ప్రేమలో పడ్డ షకీలా..! కానీ..!

షకీలా.. ఈ పేరు తెలియని వారుండరు.. శృంగార తారగా కూడా ఆమెకు మంచి పేరు. ఆమె సినిమాలను అప్పటి యువతరం ఎగబడి మరీ చూసేవారు. షకీలా సినిమా వస్తుందంటే.. పెద్ద హీరోలు సైతం వారి సినిమా విడుదలకు ఆలోచించేవారు. ఇటు తెలుగులోనూ.. అటు మలయాళంలోనూ.. ఆమె ఒకప్పటి నెంబర్ వన్ తార. ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయకపోయినా.. ఆమె క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదన్నది వాస్తవం. ఇటీవలే ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. తన స్వస్థలం […]

ఎనిమిది సార్లు ప్రేమలో పడ్డ షకీలా..! కానీ..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 30, 2019 | 6:40 PM

షకీలా.. ఈ పేరు తెలియని వారుండరు.. శృంగార తారగా కూడా ఆమెకు మంచి పేరు. ఆమె సినిమాలను అప్పటి యువతరం ఎగబడి మరీ చూసేవారు. షకీలా సినిమా వస్తుందంటే.. పెద్ద హీరోలు సైతం వారి సినిమా విడుదలకు ఆలోచించేవారు. ఇటు తెలుగులోనూ.. అటు మలయాళంలోనూ.. ఆమె ఒకప్పటి నెంబర్ వన్ తార. ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయకపోయినా.. ఆమె క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదన్నది వాస్తవం.

ఇటీవలే ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. తన స్వస్థలం నెల్లూరని.. హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చానని.. కానీ అనుకోకుండా కొందరి చేతిలో మోసపోవడం వల్ల.. బతుకుతెరువు కోసం క్యారెక్టెర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. తాను ఇంకా పెళ్లి చేసుకోలేదని.. మా జీవితాల్లో ఆనంద క్షణాలే కాదు.. కన్నీళ్లు కూడా ఉంటాయని తెలిపింది. తాను ఎనిమిది మందిని ప్రేమించానని.. వాళ్లను పెళ్లిచేసుకుందామనే ఉద్ధేశ్యంతోనే సిన్సియర్‌గా ప్రేమించానని.. కానీ ఎవరూ నాతో నిజాయితీగా ఉండలేదని చెప్పింది. వారు వివిధ రకాల కండీషన్స్ పెట్టేవారని అవి నచ్చకనే దూరం చేసుకున్నట్లు తెలిపారు. బ్రదర్స్.. తన ప్రేమ విషయంలో జోక్యం చేసుకోకూడదని, మా అమ్మను వృద్ధాశ్రమంలో చేర్చాలని, అలాగే.. నా సంపాదన వాళ్లకే ఇవ్వాలని వివిధ రకాలైన కండీషన్స్‌తో తాను ప్రేమించిన వారిని దూరం చేసుకోవాల్సి వచ్చిందని ఆమె తాజా ఇంటర్య్వూలో తెలిపారు. తనకు పెళ్లికంటే కుటుంబమే ముఖ్యమని అందుకే తాను పెళ్లి చేసుకోకుండా.. ఇలాగే ఉండిపోయినట్టు చెప్పారు షకీల.