AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Serial Actor : బుల్లితెరపై సంచలనం.. ఋతురాగాలు సీరియల్ హీరో ఎలా చనిపోయారో తెలుసా.. ?

రుతురాగాలు సీరియల్ నటుడు రాజా మరణం పట్ల నటి రూపా దేవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాజా మంచి మనసున్న వ్యక్తి అని, సెట్‌లో అందరితో స్నేహంగా ఉండేవారని ఆమె తెలిపారు. తమ కెరీర్‌కు రుతురాగాలు సీరియల్ ఎంతో సహాయపడిందని, రాజా లేని లోటు తీర్చలేనిదని రూపా దేవి అన్నారు. ఆయన పాత్రకు ప్రాణం పోశారని గుర్తు చేసుకున్నారు.

Serial Actor : బుల్లితెరపై సంచలనం.. ఋతురాగాలు సీరియల్ హీరో ఎలా చనిపోయారో తెలుసా.. ?
Raja
Rajitha Chanti
|

Updated on: Sep 13, 2026 | 2:40 PM

Share

ఒకప్పుడు బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్ ఋతురాగాలు. ఇందులో నటించిన నటీనటులు సైతం ఎంతో పాపులర్ అయ్యారు. అయితే ఇందులో ప్రధాన పాత్రలో నటించిన నటుడు రాజా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 1989-90 రోజుల్లో స్మాల్ స్క్రీన్ పై విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అప్పట్లోనే హ్యాండ్సమ్ హీరో. 1980లో స్వప్న అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా పలు చిత్రాల్లో నటించారు. తర్వాత నెమ్మదిగా సీరియల్స్ చేశారు. ముఖ్యంగా మంజుల నాయుడు తెరకెక్కించిన ఋతురాగాలు సీరియల్ ద్వారా పాపులర్ అయ్యాడు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం అప్పట్లో ఇండస్ట్రీని తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. అయితే ఈ సీరియల్లో ముఖ్య పాత్ర పోషించిన రూపాదేవి నటుడు రాజా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : బాబోయ్.. నెట్టింట గత్తరలేపుతున్న దండుపాళ్యం బ్యూటీ.. ఆమె ఇన్ స్టా చూస్తే..

ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, రాజా మంచి మనసున్న వ్యక్తి అని, సెట్‌లో అందరితో చాలా స్నేహంగా ఉండేవారని తెలిపారు. “రుతురాగాలు” సీరియల్ తమ అందరికీ ఒక మంచి జీవితాన్ని ఇచ్చిందని రూపా దేవి పేర్కొన్నారు. రాజా అకస్మాత్తుగా మరణించారని, అది ఇప్పటికీ నమ్మశక్యం కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేనని రూపా దేవి అన్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Serial Song : పేరుకే సీరియల్ సాంగ్.. కుర్రాళ్లను ఓ ఊపు ఊపేసిన పాట ఇది.. ఇప్పటికీ యూట్యూబ్‏లో తగ్గని డిమాండ్..

ఆ రోజుల్లో తమ కాంబినేషన్‌ను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని, ఇప్పటికీ ఆ సీరియల్ గురించి మాట్లాడుకోవడం తనకు సంతోషాన్ని ఇస్తుందని ఆమె వివరించారు. రాజా రూపంలో పరిశ్రమ ఒక మంచి కళాకారుడిని కోల్పోయిందని రూపా దేవి అన్నారు. ఆయన చివరి రోజుల్లో చాలా బాధపడ్డారని విన్నానని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ఆమె చెప్పారు. రాజా ఒక మంచి నటుడే కాకుండా, మంచి స్నేహితుడు కూడా అని, ఆయనతో కలిసి పని చేయడం తన అదృష్టమని ఆమె తెలిపారు. “రుతురాగాలు” సీరియల్‌లో ఆయన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందని, ఆ పాత్రకు ఆయన ప్రాణం పోశారని రూపా దేవి గుర్తుచేసుకున్నారు. రాజా లేని లోటు తీరనిదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood: సినిమా మొత్తం హీరో ఒకే రంగు షర్ట్ లో ఉంటాడు.. హిట్టు కాదన్నారు.. థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా తర్వాత హీరోయిన్‏కు వెండి పళ్లెంలో పట్టు బట్టలు ఇచ్చాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..

Follow Us