Irumudi OTT: ఇట్స్ అఫీషియల్.. థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఓటీటీ ఆడియెన్స్ కు గుడ్ న్యూస్.. మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఇరుముడి' స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ మేరకు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది.

మాస్ మహరాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ఇరుముడి’. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ డివోషనల్ థ్రిల్లర్ సినిమా సంచలన విజయం సాధించింది. కనీవినీ ఎరుగని కలెక్షన్లతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ఇప్పటికే ఈ సినిమా రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. థియేటర్లలో ఈ సినిమా రిలీజై మూడు వారాలు గడిచిపోయాయి. ఇప్పటికీ రవితేజ సినిమాకు హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయి. చాలా చోట్ల ట్రాక్టర్లతో వెళ్లి మరీ థియేటర్లలో ఈ సినిమాను చూస్తున్నారు. అయితే థియేటర్లలో ఉండగానే ఇరుముడి సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆదివారం (సెప్టెంబర్ 13) రవితేజ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన వెలువడింది. ‘ఇరుముడి’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం (సెప్టెంబర్ 18) నుంచే ఇరుముడి సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఇరుముడి సినిమా అందుబాటులోకి రానుంది.
ఇరుముడి సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. రవితే జసరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించిగా, కూతురిగా బేబీ నక్షత్ర క్యూట్ యాక్టింగ్ తో మెప్పించింది. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక తదితరులు కీలక పాత్రలు పోషించారు.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఇరుముడి సినిమాను నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
నెట్ ఫ్లిక్స్ లో రవితేజ ఇరుముడి సినిమా.. ఈ వారంలోనే స్ట్రీమింగ్..
#Irumudi (Telugu) will premiere on Netflix India, Sept 18th.
Ft. #RaviTeja | #PriyaBhavaniShankar pic.twitter.com/dd7gmUzOSi
— OTT Gate (@OTTGate) September 13, 2026
ముఖ్యంగా మల్లెపూల పల్లకి సాంగ్ యూట్యూబ్ లో ఛార్ట్ బస్టర్ గా నిలిచింది. థియేటర్లలో ఈ సాంగ్ వచ్చినప్పుడు ఆడియెన్స్ పూలు చల్లి, హారతులు పట్టారు. మరి థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఇరుముడి ఓటీటీలో ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.
మల్లెపూల పల్లకి సాంగ్.. ఫుల్ వీడియో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




