ఉత్తరప్రదేశ్లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. 21 ఏళ్ల వివాహబంధం, ఐదుగురు పిల్లలు ఉన్నప్పటికీ, తన భార్య వేరే వ్యక్తిని ప్రేమించానని చెప్పగా, ఆమె ఇష్టాన్ని గౌరవిస్తూ భర్త ప్రియుడితో ఆమెకు వివాహం జరిపించాడు. ఈ నిర్ణయం గ్రామంలో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.