పంజాబ్లోని కపుర్తలాలో సంచలనం రేపిన ఘటన. అదృశ్యమైన యువకుడు రవికుమార్ చనిపోయాడని భావించి, కాలిపోయిన మృతదేహానికి కుటుంబం అంత్యక్రియలు నిర్వహించింది. అయితే, నెల రోజుల తర్వాత రవికుమార్ కపుర్తలా జైలు నుంచి ఫోన్ చేయడంతో కుటుంబం షాక్కు గురైంది. బతికున్న కొడుకు జైలులో ఉండగా, దహనం చేసిన మృతదేహం ఎవరిదనేది ఇప్పుడు పోలీసుల విచారణలో ఉంది.