ఒకప్పుడు బిగ్ బాస్ లో ఈ అమ్మడు గ్లామర్ సెన్సేషన్.. ఇప్పుడు సైలెంట్..

Rajitha Chanti

Pic credit - Instagram

12 September 2026

బుల్లితెరపై ప్రసారమయ్యే పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ద్వారా ఎంతోమంది భామలు రాత్రికి రాత్రే విపరీతమైన క్రేజ్, పాపులారిటీ సొంతం చేసుకున్నారు.

హమీదా

అలాంటి వారిలో హమీదా ఒకరు. బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టకముందు ఈ అమ్మడు గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు.

హమీదా

కానీ, హౌస్‌లో తన ఆట తీరు, చురుకైన ప్రవర్తన, అల్లరితో పాటు గ్లామర్ లుక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుని బుల్లితెరపై తెగ ఫేమస్ అయ్యింది.

హమీదా

బిగ్ బాస్ షో ఇచ్చిన పాపులారిటీతో హమీదాకు టెలివిజన్ రంగంలో మంచి అవకాశాలు లభించాయి. బ్రహ్మముడిలో స్వప్న పాత్రతో ఫేమస్ అయ్యింది.

హమీదా

ప్రారంభంలో కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించినా, ఆ తర్వాత ఆమె క్యారెక్టర్ పాజిటివ్‌గా మారి అందరి ప్రశంసలు అందుకుంది. 

హమీదా

తన అందం, అభినయంతో ఆడియన్స్‌ను కట్టిపడేసిన హమీదా, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఉన్నట్లుండి ఆ సీరియల్ నుంచి తప్పుకున్నారు.

హమీదా

సీరియల్ నుంచి వైదొలిగిన తర్వాత బుల్లితెర స్క్రీన్లపై హమీదా పెద్దగా కనిపించకుండా కాస్త సైలెంట్ అయ్యారు. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు.

హమీదా

నిత్యం మోడ్రన్ అవుట్‌ఫిట్స్, లంగావోణిలు, గ్లామరస్ మెహందీ కలర్ లెహంగాలలో రకరకాల ఫోటోషూట్‌లు చేస్తూ నెటిజన్లను కవ్విస్తున్నారు.

హమీదా