AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: మీరు నిజంగానే ప్రేమలో ఉన్నారా.? రష్మిక సమాధానం ఇదే..

2016లో వచ్చిన కిరిక్‌ పార్టీ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల నటి రష్మిక మందన. ఇక ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ అనతి కాలంలోనే అగ్ర హీరోయిన్‌ల జాబితాలో చేరింది. వరుస ఆఫర్లను సొంతం చేసకుంటూ...

Rashmika Mandanna: మీరు నిజంగానే ప్రేమలో ఉన్నారా.? రష్మిక సమాధానం ఇదే..
Rashmika Mandanna
Narender Vaitla
|

Updated on: Oct 09, 2022 | 7:28 AM

Share

2016లో వచ్చిన కిరిక్‌ పార్టీ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల నటి రష్మిక మందన. ఇక ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ అనతి కాలంలోనే అగ్ర హీరోయిన్‌ల జాబితాలో చేరింది. వరుస ఆఫర్లను సొంతం చేసకుంటూ దూసుకుపోతోంది. ఇక ఇటీవల అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్రంతో ఒక్కసారిగా దేశం దృష్టిని తనవైపు తిప్పుకుందీ బ్యూటీ. ఈ సినిమాలో డీ గ్లామర్‌ పాత్రలో నటించి తనదైన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇక సినిమాలతో ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్న ఈ బ్యూటీ వ్యక్తిగత జీవితం విషయంలో నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. ముఖ్యంగా ప్రేమ వ్యవహారానికి సంబంధించిన రష్మిక టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా ఉంటుంది.

విజయ్‌ దేవరకొండతో రష్మిక ప్రేమలో ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న ముంబై ఎయిర్‌ పోర్ట్‌లో రష్మిక, విజయ్‌ విడివిడిగా కనిపించినా ఇద్దరు కలిసి మాల్దీవులు వెళ్తున్నారంటూ వార్తలు పుకార్లు చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్ని రకాల వార్తలు వచ్చినా రష్మిక మాత్రం తన ప్రేమ విషయమై ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. దీంతో ఈ బ్యూటీ ఎక్కడికి వెళ్లినా ఇదే ప్రశ్న ఎదురవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక లవ్‌ లైఫ్‌కి సంబంధించి ప్రశ్న ఎదురైంది. మీరు ప్రేమలో ఉన్నారా.? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘ఇప్పుడు నాకున్న షెడ్యూల్‌లో నా కుటుంబానికి, ఫ్రెండ్స్‌కే అందుబాటులో ఉండటం లేదు. ఇక లవ్.. రిలేషన్ షిప్ అంటే కష్టం. వారికి చాలా టైమ్ ఇవ్వాలి. ఓర్పుగా ఉండాలి. బంధం నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న నాకు అంత టైమ్ లేదు. ఒకవేళ రాబోయే రోజుల్లో ఏదైనా ఉంటే కచ్చితంగా చెబుతా’ అంటూ అసలు విషయాన్ని చెప్పేసింది.

ఇదిలా ఉంటే రష్మిక ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇక సౌత్‌లోనే కాకుండా నార్త్‌లోనూ ఈ బ్యూటీ హవా కొనసాగిస్తోంది. ఈ బ్యూటీ బాలీవుడ్‌లో నటించిన తాజా చిత్రం ‘గుడ్‌ బై’ విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న ఈ బ్యూటీ ఇందులో భాగంగానే హాజరైన ఓ ఇంటర్వ్యూలో ఇలాంటి ఆకస్తికర వ్యాఖ్యలు చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..