Rashmika Mandanna: పుష్ప‌2 ఎలా ఉండ‌నుందో తెలుసా.? ఆస‌క్తిక‌ర పోస్ట్ చేసిన ర‌ష్మిక‌..

Rashmika Mandanna: అల్లు అర్జున్, ర‌ష్మిక జంట‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన పుష్ప చిత్రం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్‌. బ‌న్నీ అద్భుత‌మైన యాక్టింగ్‌తో పాన్ ఇండియా స్థాయిలో...

Rashmika Mandanna: పుష్ప‌2 ఎలా ఉండ‌నుందో తెలుసా.? ఆస‌క్తిక‌ర పోస్ట్ చేసిన ర‌ష్మిక‌..
Follow us

|

Updated on: Jan 14, 2022 | 12:00 PM

Rashmika Mandanna: అల్లు అర్జున్, ర‌ష్మిక జంట‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన పుష్ప చిత్రం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్‌. బ‌న్నీ అద్భుత‌మైన యాక్టింగ్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రానికి ఎక్క‌డ లేని క్రేజ్ వ‌చ్చింది. ఇక ఈ సినిమాలో శ్రీవ‌ల్లి పాత్ర‌లో న‌టించిన ర‌ష్మిక కూడా ఒక్క‌సారిగా అంద‌రి దృష్టిని త‌నైవ‌పు తిప్పుకుంది. ఈ సినిమాతో న‌టిగా ర‌ష్మిక మ‌రో మెట్టు పైకెక్కింద‌ని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. ఇక ఓటీటీ వేదిక‌గా విడుద‌లైన పుష్ప చిత్రం అక్క‌డ కూడా త‌గ్గేదేలే అన్న‌ట్లు దూసుకుపోతోంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం అంద‌రి దృష్టి పుష్ప సీక్వెల్‌పై ప‌డింది. ఎప్పుడెప్పుడు పుష్ప 2 వ‌స్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఒక కూలీ సిండికేట్‌కు బాస్ ఎలా అయ్యాడ‌న‌న్న‌ది పుష్ప ది రైజ్‌లో చూపిస్తే.. ఎర్ర చంద‌నం రాజ్యాన్ని ఎలా ఏలాడు అన్న‌దాన్ని పుష్ప ది రూల్‌లో చూపించ‌నున్నాడు సుకుమార్‌. సీక్వెల్‌పై పెరిగిన అంచ‌నాల నేప‌థ్యంలో సుకుమార్ కూడా జాగ్ర‌త్త‌లు ప‌డుతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

అయితే తాజాగా న‌టి ర‌ష్మిక కూడా సీక్వెల్‌పై ఆస‌క్తిక‌ర పోస్ట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా త‌న లేటెస్ట్ ఫోటోను పోస్ట్ చేసిన ఈ చిన్న‌ది.. ‘పుష్ప సినిమా పట్ల మీరు చూపిన ఆదరణ, ప్రేమకు ధన్యవాదాలు. ఈ ప్రేమ మమ్మల్ని మరింత కష్టపడి పని చేసేలా చేసింది. పుష్ప 2 మంది గొప్ప‌గా, అద్భుతంగా ఉంటుంద‌ని మేము వాగ్దానం చేస్తున్నాము అని రాసుకొచ్చింది. దీంతో పుష్ప సీక్వెల్ అంద‌రిలోనూ క్యూరియాసిటీని పెంచేస్తోంది.

Also Read: Covid Vaccination: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో తెలంగాణ సరికొత్త రికార్డ్.. మొద‌టి డోస్‌ను 100% పూర్తి..

Sunitha: సింగర్ సునీత బర్త్ డే కేక్ కటింగ్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Ashok Galla’s Hero: మహేష్ మేనల్లుడికోసం రంగంలో ఆ స్టార్ హీరోలు.. ‘హీరో’ ప్రీ రీలీజ్ కు గెస్ట్ లు ఎవరంటే..