Priyanka Jawalkar : పవర్ స్టార్ అంటే పిచ్చి.. ఆయన సినిమాలో ఛాన్స్ వస్తే నటించను..కానీ.. ప్రియాంక జవల్కర్ ఆసక్తికర కామెంట్స్
ఇక పవన్ తో సినిమా చేయడానికి స్టార్ హీరోయిన్స్ క్యూలో ఉంటారు. పవన్ సినిమాలో ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ మాత్రం కాదని అంటారా..? కానీ ఒక హీరోయిన్ మాత్రం పవన్ సినిమాలో నటించాను అని ఓపెన్ గా చెప్పేస్తుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. పవన్ సినిమా వస్తుందట ఫ్యాన్స్ కు పండగే.. పాన్ ఇండియాతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా పవర్ స్టార్ కు క్రేజ్ఉంది. ఇక పవన్ తో సినిమా చేయడానికి స్టార్ హీరోయిన్స్ క్యూలో ఉంటారు. పవన్ సినిమాలో ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ మాత్రం కాదని అంటారా..? కానీ ఒక హీరోయిన్ మాత్రం పవన్ సినిమాలో నటించాను అని ఓపెన్ గా చెప్పేస్తుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో తెలుసా..? ప్రియాంక జవల్కర్. షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయిన్ గ మారిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమానే క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో చేసి పాపులర్ అయ్యింది. టాక్సీవాలా సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ప్రియాంక. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి.
స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వస్తుందేమో అని ఎదురుచూస్తున్న ఈ భామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో మాత్రం నటించాను అని చెప్తోంది. ఇంతకు ఆ భామ అలా ఎందుకు చెప్పిందంటే.. పవన్ కళ్యాణ్ అంటే ప్రియాంకకు విపరీతమైన ఇష్టమట..వన్ కల్యాణ్ అంటే పిచ్చి అని, ఆయన నటించిన తమ్ముడు సినిమాను 20 సార్లు చూశానని ఆమె చెప్పింది. ఖుషీ సినిమాలో ప్రతీ డైలాగ్ కూడా తనకు గుర్తుందంటోంది.
ఆయనను దూరం నుంచి చూస్తూ అభిమానిస్తూనే ఉంటాను కానీ.. ఆయనతో సినిమా చేయలేను అని అంటుంది. అంత పెద్ద స్టార్ అయినా కూడా పవన్ అంత సింపుల్‌గా ఎలా ఉంటారో తనకు అర్థం కాదని చెప్పింది. ఆయనకు అభిమానించడం తప్పా ఈ జీవితానికి మరొకటి అవసరం లేదు అంటుంది ప్రియాంకా.
