ఇంత అందమైన దెయ్యమా..! లారెన్స్ కాంచన 4లో స్టార్ హీరోయిన్.? ఫ్యాన్స్‌కు పండగే
రాఘవ లారెన్స్.. హారర్ సినిమాలకు పెట్టింది పేరు. నటుడిగా, కొరియోగ్రాఫర్ గా దర్శకుడిగా మల్టీ టాలెంట్ తో దూసుకుపోతున్నాడు లారెస్స్. ఈ మధ్య లారెన్స్ సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చారు. చివరిగా చంద్రముఖి 2లో నటించారు లారెన్స్. ఇక ఇప్పుడు మరోసారి హారర్ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టనున్నాడు.

హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో హారర్ నేపథ్యంలో విడుదలైన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక రాఘవ లారెన్స్ తెరకెక్కించిన కాంచన సినిమా అయితే ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టింది. అప్పటివరకు వచ్చిన హారర్ సినిమాలను బీట్ చేస్తూ లారెన్స్ తెరకెక్కించిన కాంచన సిరీస్ మంచి విజయాలను అందుకున్నాయి. మొదటిగా ముని సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు లారెన్స్.. తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోనూ విడుదలై హిట్ అయ్యింది. ఆతర్వాత వచ్చిన ముని 2: కాంచన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు లారెన్స్. ఆతర్వాత వచ్చిన ముని 3: గంగ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూడు సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు హీరోగానూ నటించి మెప్పించారు రాఘవ లారెన్స్.
ప్రస్తుతం లారెన్స్ ముని 4: కాంచన 4తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పనులు శరవేంగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ గురించి గత కొంతంకాలంగా సోషల్ మీడియాలో వార్తలు తెగ వినిపిస్తున్నాయి. స్టార్ హీరోయిన్ కాంచన 4 సినిమాలో దెయ్యంగా కనిపించనుందని టాక్ వినిపించింది. అలాగే హీరోయిన్ పూజా హెగ్డే కాంచన 4 సినిమాలో దెయ్యంగా నటిస్తుందని జోరుగా ప్రచారం జరిగింది.
కానీ ఇప్పుడు మరో హీరోయిన్ పేరు తెర పైకి వచ్చింది. ఆమె ఎవరో కాదు క్రేజీ స్టార్ నయనతార. ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా దూసుకుపోతున్న నయనతార కాంచన 4లో నటించనుందని తెలుస్తుంది. ఇటీవలే చిత్రయూనిట్ ఆమెను సంప్రదించారని కథ విన్న తర్వాత ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ కోలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది. అంతే కాదు ఈ సినిమాలో ఆమె దెయ్యంగా కనిపించనుందని అంటున్నారు. కొందరేమో ఆమె గెస్ట్ రోల్ లో మాత్రమే కనిపిస్తారు అని అంటున్నారు. నయన్ ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. హిందీలో సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే తమిళ్ లోనూ బిజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు కాంచన 4 లో నయన్ నటిస్తుందని టాక్ రావడంతో సినిమా పై హైప్స్ అమాంతం పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాలో ఆమె నటిస్తున్నారా లేదా అన్నది మాత్రం అధికారికంగా తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
