నోరూరించే మామిడి పండ్లను సరైన పద్ధతిలో తినడం అత్యవసరం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లేదా మధ్యాహ్నం స్నాక్‌గా తీసుకోవడం ఉత్తమం. భోజనంతో పాటు లేదా రాత్రిపూట తినడం మానుకోండి. ఫైటిక్ యాసిడ్‌ను తగ్గించడానికి కనీసం గంటపాటు నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, జీర్ణ సమస్యలు నివారించబడతాయి, పండులోని పోషకాలు శరీరానికి పూర్తిస్థాయిలో అందుతాయి.