AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు.. వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరిస్తుండటంతో వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు.. వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
Rain Alert
Shaik Madar Saheb
|

Updated on: Jun 13, 2026 | 2:04 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు ఎండలు.. మరో వైపు వర్షాలు కురుస్తున్నాయి.. నైరుతి రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుండటంతో.. చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నైరుతి రుతుపవనాలు ఈ రోజు (13 జూన్, 2026) వాయువ్య బంగాళాఖాతం మొత్తం, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, బీహార్, అలాగే ఒడిశా, జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయి. 12 జూన్, 2026 వ తేదీ నాటికి, నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి పయనం 18° ఉత్తర అక్షాంశం /60° తూర్పు రేఖాంశం, 18° ఉత్తర అక్షాంశం /65° తూర్పు రేఖాంశం, 18° ఉత్తర అక్షాంశం /70° తూర్పు రేఖాంశం, హర్నై, సోలాపూర్, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కళింగపట్నం, పారాదీప్, బారిపద, పురూలియా, ధన్‌బాద్, ముజఫర్‌పూర్, 28.3° ఉత్తర అక్షాంశం /83° తూర్పు రేఖాంశం గుండా విస్తరించింది. ఉత్తర కోస్తా తమిళనాడు పై ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఉత్తర కోస్తా తమిళనాడుపై ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా దాదాపుగా 11° ఉత్తర అక్షాంశం వద్ద గాలుల కోత కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో, దక్షిణ తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. నిన్నటి, సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీనపడింది.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి:-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం :

శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

రాయలసీమ :-

శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

Follow Us