AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cone Dosa ఎప్పుడూ.. రొటీన్ దోసేనా.. ఈ సండే ఇంట్లోనే హోటల్ స్టైల్ క్రిస్పీ కోన్ దోస ఇలా చేసుకోండి..

మన సౌతిండియాలో మార్నింగ్ బ్రేక్‌ ఫాస్ట్‌లోకి జనాలు ఎక్కవగా ఇష్టపడే ఫుడ్ ఏదైనా ఉందంటే.. అది దోశ మాత్రమే. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఇది ఫేవరెట్ బ్రేక్‌ ఫాస్ట్. అయితే మర్కెట్‌లో ఎన్ని రకాల దోశలు ఉన్న పిల్లలకు మాత్రం కోన్ దోశ తినాలనే అనిపిస్తుంది. కాబట్టి ఈ కోన్ దోశను ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Cone Dosa ఎప్పుడూ.. రొటీన్ దోసేనా.. ఈ సండే ఇంట్లోనే హోటల్ స్టైల్ క్రిస్పీ కోన్ దోస ఇలా చేసుకోండి..
Restaurant Style Crispy Cone Dosa Recipe
Anand T
|

Updated on: Jun 13, 2026 | 1:58 PM

Share

సౌత్ ఇండియన్ ఫుడ్ లవర్స్‌కి దోశ ఎప్పుడూ ఆల్‌టైమ్ ఫేవరెట్. మార్కెట్‌లో మనకు రకరకాల దోశలు దొరుకుతాయి. మసాలా దోశ, పనీర్ దోశ, పేపర్ రోస్ట్ వంటి ఎన్నో రకాలు ఉన్నప్పటికీ, పిల్లలను ఎక్కువగా ఆకట్టుకునేది మాత్రం కోన్ దోశనే. దీనిని ఇంట్లో చేయడం కష్టం అని చాలా మంది అనుకుంటారు కానీ, కొన్ని సింపుల్ ట్రిక్స్ పాటిస్తే దీన్ని ఇంట్లోనే పర్ఫెక్ట్‌గా తయారు చేయవచ్చు.

ఇంట్లోనే కోన్ దోశ ఎలా చేయాలి

కోన్ దోశ పిండి ఎలా ఉండాలి?

మనకు క్రిస్పీ కోన్ దోశ కోసం మీరు ప్రత్యేకంగా పిండి రెడీ చేసుకోవాల్సిన అవసరం లేదు రోజూ వాడే సాధారణ దోశ పిండితోనే వీటిని కూడా తయారు చేయవచ్చు. కానీ పిండి మరీ గట్టిగా ఉండకూడదు. సాధారణ పిండిలో 3 నుండి 4 చెంచాల నీళ్లు కలిపి కాస్త పల్చగా చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ సరిగ్గా ఉంటేనే దోశను పెనంపై వేసినప్పుడు పేపర్‌లా పల్చగా, క్రిస్పీగా వస్తుంది. దోశ క్రిస్పీగా రాకపోతే, దానిని చుట్టేటప్పుడు విరిగిపోతుంది.

కాల్చే విధానం

మీకు కోన్ దోశ పర్ఫెక్ట్‌గా రావడానికి అసలైన ట్రిక్ దానిని కాల్చడం, కట్ చేయడంలోనే ఉంది. ఇందుకోసం మొదట నాన్-స్టిక్ లేదా కాస్ట్ ఐరన్ పెనాన్ని మీడియం ఫ్లేమ్‌పై వేడి చేయండి. దానిపై కొద్దిగా నీళ్లు చల్లి, కాటన్ గుడ్డతో తుడిచేయండి. ఇలా చేయడం వల్ల పెనం టెంపరేచర్ సెట్ అవుతుంది. ఇప్పుడు ఒక గరిటెడు పిండిని పెనం మధ్యలో వేసి, గుండ్రంగా తిప్పుతూ ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేయండి . దీని చుట్టూ, మధ్యలో కొద్దిగా నూనె, బటర్ లేదా నెయ్యి వేయండి. నెయ్యి వేస్తే దోశ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మారి ఎక్కువ క్రిస్పీగా అవుతుంది.

ఇక్క మీరు గుర్తించుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే ఈ దోశను కేవలం ఒక వైపు మాత్రమే కాల్చాలి, రెండో వైపు తిప్పకూడదు. దోశ కింది భాగం బ్రౌన్ కలర్‌లోకి మారి క్రిస్పీగా అవుతున్నప్పుడు.. అట్లకాడ సహాయంతో దోశ మధ్య భాగం వరకు ఒక నిలువు కట్ పెట్టండి. ఇలా కట్ చేసిన తర్వాత దోశను రోల్ చేసే విధానం చాలా ముఖ్యం.

ఇందుకోసం దోశ పూర్తిగా కాలిన తర్వాత స్టవ్ ఫ్లేమ్‌ను సిమ్‌లో పెట్టండి. ఇప్పుడు కట్ చేసిన ఒక అంచుని పట్టుకుని, లోపలి వైపునకు గుండ్రంగా తిప్పుతూ చుట్టండి. పెనంపై వేడిగా ఉన్నప్పుడే ఇలా రోల్ చేయడం వల్ల దోశ కోన్ షేప్‌ను సులభంగా హోల్డ్ చేస్తుంది . దీనిని చేతులతో లే  పటకారు సహాయంతో జాగ్రత్తగా ఐస్‌క్రీమ్ కోన్ లేదా రాకెట్ షేప్ వచ్చేలా చుట్టండి. అంతే ఎంతో క్రిస్పీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ కోన్ దోశ రెడీ. దీనిని వేడివేడి సాంబార్, కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. కాబట్టి మీ పిల్లలు ఇష్టంగా తినే ఈ కోన దోశను కచ్చితంగా ఈ సండే ట్రై చేయండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిమీ

Follow Us