Kasthuri: ‘నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు’.. క్లారిటీ ఇచ్చిన కస్తూరి
నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. తమిళనాడులో ఉంటున్న తెలుగు వారి మనోభావాలను దెబ్బ తీసినట్లు ఉన్న ఆమె వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో ఈ వ్యాఖ్యలపై ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు..
తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. కస్తూరి చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పలువురు కామెంట్స్ చేశారు. తమిళనాడులో ఉన్న వారికి కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను పలువురు ఖండించారు.
300 ఏళ్ల క్రితం తెలుగు వారు వలస వచ్చి.. ఇక్కడ అంతఃపురంలో సేవలు చేసేవారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో కస్తూరి వెంటనే క్షమాపణలు చెప్పాలని తమిళనాడు బీజేపీ ఇన్‌ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోదర భావంతో మెలిగే తెలుగు, తమిళ ప్రజల మధ్య ఇలాంటి వ్యాఖ్యలు చిచ్చుపెడతాయన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై వెంటనే స్పందించారు కస్తూరి.
ఆమె చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండడంతో క్లారిటీ ఇస్తూ ఆమె పోస్ట్‌లు చేశారు. ‘తెలుగు నా మెట్టినిల్లు. తెలుగు వారంతా నా కుటుంబం. ఇది తెలియనివారు నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. తెలుగు వారు ఎంతోమంది నాపై ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. తమిళ మీడియాలో నా కామెంట్స్‌ను వక్రీకరిస్తూ వస్తోన్న వార్తలను తెలుగు ప్రజలు నమ్మొద్దని కోరుతున్నా. డీఎంకే పార్టీ నా కామెంట్స్‌ను వక్రీకరిస్తోంది. ఇలా నాపై నెగెటివిటీ తీసుకొచ్చి నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తోంది. నేను తెలుగు వారికి వ్యతిరేకంగా మాట్లాడానంటూ విష ప్రచారం చేస్తోంది’ అంటూ రాసుకొచ్చారు. మరి ఇక్కడితో ఈ వివాదానికి తెర పడుతుందో లేదో చూడాలి.
Yesterday I exposed the double standards of fraud dravidia migrant imposters who play divisive hate politics among tamils. Today DMK ecosystem trying to bully me by running a smear campaign about my telugu loyalty. They are trending FAKE NEWS that i spoke against telugus.
— Kasturi (@KasthuriShankar) November 4, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..