kajal aggarwal: మునపటి ఫిట్‌నెస్‌ కోసం చమటలు చిందిస్తోన్న చందమామ.. వీడియో చూస్తే వావ్‌ అనాల్సిందే..

kajal aggarwal: లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార కాజల్‌ అగర్వాల్‌. తర్వాత వచ్చిన చందమామ చిత్రంతో ఒక్కసారి ఇండస్ట్రీ దృష్టిని తనపైపు తిప్పకుందీ బ్యూటీ...

kajal aggarwal: మునపటి ఫిట్‌నెస్‌ కోసం చమటలు చిందిస్తోన్న చందమామ.. వీడియో చూస్తే వావ్‌ అనాల్సిందే..
Kajal aggarwal

Updated on: Sep 25, 2022 | 1:15 PM

kajal aggarwal: లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార కాజల్‌ అగర్వాల్‌. తర్వాత వచ్చిన చందమామ చిత్రంతో ఒక్కసారి ఇండస్ట్రీ దృష్టిని తనపైపు తిప్పకుందీ బ్యూటీ. ఇక అనంతరం వరుసగా విజయవంతమైన చిత్రాల్లో నటించి దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించే చాన్స్‌ కొట్టేసిందీ బ్యూటీ. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే వివాహం చేసుకుంది.

ఇక కాజల్‌ అగర్వాల్‌ ఇటీవల ఓ బాబుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తన ఆలనా పాలనా చూసుకుంటున్న ఈ భామ తిరిగి ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గుర్రపు స్వారీ నేర్చుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ఇక బిడ్డకు జన్మనిచ్చిన తరుణంలో భారీగా బరువు పెరిగిన కాజల్‌ ఇప్పుడు బరువు తగ్గే పనిలో పడింది. ఇందులో భాగంగానే మార్షల్‌ ఆర్ట్స్‌ను నేర్చుకుంటోంది. ప్రత్యేకంగా ఓ ట్రైనర్‌ను నియమించుకున్న కాజల్‌ చమటలు చిందిస్తూ కుస్తీ పడుతోంది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో ఈ వీడియో కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇదిలా ఉంటే చాలా కాలం పాటు సినిమాకు బ్రేక్‌ ఇచ్చిన కాజల్‌ తాజాగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఇండియన్‌ 2’లో నటిస్తోన్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననుంది. ఇందులో భాగంగానే తన ఫిట్‌నెస్‌ను మార్చుకోవడానికి ఇలా కసరత్తులు మొదలు పెట్టింది. ఇక దర్శకుడు శంకర్‌ ఓవైపు ఇండియన్‌2ని తెరకెక్కిస్తూనే మరోవైపు రామ్‌ చరణ్‌ హీరోగా మరో సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..