AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళ దర్శకుడితో ఎనర్జిటిక్ స్టార్… 19వ సినిమా గురించి అఫీషియల్‏గా ప్రకటించిన చిత్రయూనిట్..

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని ఇటీవలే 'రెడ్' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత రామ్ ఏ డైరెక్టర్‏తో కలిసి సినిమా చేయబోతున్నాడనే

తమిళ దర్శకుడితో ఎనర్జిటిక్ స్టార్... 19వ సినిమా గురించి అఫీషియల్‏గా ప్రకటించిన చిత్రయూనిట్..
Rajitha Chanti
|

Updated on: Feb 18, 2021 | 1:59 PM

Share

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని ఇటీవలే ‘రెడ్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత రామ్ ఏ డైరెక్టర్‏తో కలిసి సినిమా చేయబోతున్నాడనే విషయంపై కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన తమిళ దర్శకుడు లింగుస్వామితో ఓ సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ.. అందుకు సంబంధించిన అఫీషియల్ స్టేట్ మెంట్ ఇచ్చారు రామ్.

రామ్ తన తదుపరి సినిమాను తమిళ డైరెక్టర్ లింగుస్వామితో కలిసి చేయబోతున్నట్లుగా ప్రకటించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రిన్ బ్యానర్ పై శ్రీనివాస చిత్తూరి ఈ సినిమాను నిర్మించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ రామ్ కెరీర్‏లో 19వ సినిమాగా రాబోతుంది. రామ్ కోసం ఓ మాస్ కథను సిద్ధం చేసుకున్నారట లింగుస్వామి. అంతేకాదు ఇందులో రామ్ విభిన్నంగా చూపించాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. ఈ ఫుల్ మాస్ యాక్షన్ స్టోరీ రామ్‏కు నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. ఇక ఇందులో నటించే నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

Also Read:

Pushpa Movie Update: ‘పుష్ప’ మూడవ షెడ్యూల్ స్టార్ట్… షూటింగ్ కోసం కేరళకు పయనమైన అల్లు అర్జున్..