హీరో రాజశేఖర్ ఇంట్లో అందరికీ కరోనా.. కోలుకున్న తనయలు

దేశంలో కరోనా విజృంభణ ఆగడం లేదు. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే అన్ని రాష్ట్రాల్లో రికవరీ రేటు ఎక్కువగా ఉండటం కాస్త ఊరటను కలిగిస్తోంది

హీరో రాజశేఖర్ ఇంట్లో అందరికీ కరోనా.. కోలుకున్న తనయలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 17, 2020 | 1:16 PM

Rajasekhar family Corona: దేశంలో కరోనా విజృంభణ ఆగడం లేదు. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే అన్ని రాష్ట్రాల్లో రికవరీ రేటు ఎక్కువగా ఉండటం కాస్త ఊరటను కలిగిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్‌ నటుడు రాజశేఖర్ కుటుంబంలో అందరూ కరోనా బారిన పడ్డారు. రాజశేఖర్, భార్య జీవితా, పిల్లలు శివాని, శివాత్మిక అందరికీ కరోనా సోకింది. వారిలో శివాని, శివాత్మిక ఇటీవల కోలుకున్నారు. ఇక జీవిత, రాజశేఖర్ ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన రాజశేఖర్‌.. త్వరలోనే తాము ఆరోగ్యంతో తిరిగి వస్తామని వెల్లడించారు. కాగా టాలీవుడ్‌లో పలువురు ఇప్పటికే ఈ వైరస్ బారిన పడగా.. వారిలో చాలా మంది కోలుకున్నప్పటికీ, కొందరు మరణించారు.

Read More:

దసరా ఉత్సవాలు: బిడ్డలను ఎత్తుకున్న ‘దుర్గమ్మ’.. మొత్తానికి ఇంటికి చేరుకుంది

‘మహా సముద్రం’లో మరో హీరోయిన్ ఎవరంటే..!