ట్రిపులార్ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడారు ఎన్టీఆర్. శుక్రవారం జరిగిన ధమ్కీ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ధమ్కీ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ స్పందించారు. ఆర్ఆర్ఆనఖ చిత్రం ఈ రోజు ప్రపంచ పటంలో నిలబడిందన్నారు. ఆస్కార్ అవార్డ్ వచ్చింది అంటే రాజమౌళి కీరవాణి చంద్రబోస్ ప్రేమ్ రక్షిత్ ఎంత కారణమో తెలుగు చలన చిత్ర పరిశ్రమ కూడా కారణం, మీ అభిమానం కారణం అని పేర్కొన్నారు.
ఆస్కార్ వేదిక పై కీరవాణి, చంద్రబోస్ లను చూసినప్పుడు ఇద్దరు భారతీయులు ఆ అవార్డ్ తీసుకున్నారు అని పించిందని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. తెలుగు పరిశ్రమ అద్భుతమైన స్థానంలో ఉందన్న ఎన్టీఆర్.. ఆస్కార్ వేదికపై తెలుగుదనం ఉట్టిపడిందని అభివర్ణించారు. ఇకపై భారతీయ సినిమాలు ఆస్కార్ వేదికపై మెరుస్తాయని ఎన్టీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికాలోని లాస్ ఏంజిలెస్‌లో జరిగిన ఆస్కార్ వేడుకలకు హాజరమైన ఎన్టీఆర్ గురువారం ఢిల్లీకి చేరుకున్న విషం విధితమే. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు పెద్ద ఎత్తున స్వాగతం దక్కింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..