Nivin Pauly : స్టార్ హీరోపై వేధింపుల కేసు.. అవకాశం ఇప్పిస్తానంటూ మాయ మాటలు చెప్పి..

గత నవంబర్‌లో దుబాయ్‌లో తనపై అత్యాచారం జరిగిందని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఎర్నాకులం ఊనుంకల్ పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తును సిట్‌ చేపడుతుందని పోలీసులు తెలిపారు. సినిమాలో అవకాశం ఇప్పిస్తానని తనను వేధించారని యువతి ఫిర్యాదు చేసింది.

Nivin Pauly : స్టార్ హీరోపై వేధింపుల కేసు.. అవకాశం ఇప్పిస్తానంటూ మాయ మాటలు చెప్పి..
Nivin Pauly
Follow us

|

Updated on: Sep 03, 2024 | 7:46 PM

సినిమాలో అవకాశం ఇప్పిస్తానని హీరో నివిన్‌ పౌలీ వేధించాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఎర్నాకులం రూరల్ ఎస్పీకి ఇండస్ట్రీకి చెందిన ఓ నటి ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదు చేయాల్సిందిగా ఊన్నుకల్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ కేసులో నివిన్ పౌలీ ఆరో నిందితుడిగా పేర్కొనగా.. నిర్మాత ఎకె సునీల్ రెండో నిందితుడిగా ఉన్నారు. మరి కొందరు నిందితుల్లో శ్రేయ అనే మహిళ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెను మొదటి నిందితురాలిగా చేర్చారు పోలీసులు. గత నవంబర్‌లో సినిమా అవకాశం గురించి మాట్లాడాలని తనను దుబాయ్ కు తీసుకెళ్లారని.. అక్కడే తనపై అత్యాచారం జరిగిందని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఎర్నాకులం ఊనుంకల్ పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తును సిట్‌ చేపడుతుందని పోలీసులు తెలిపారు.

సినిమాలో అవకాశం ఇప్పిస్తానని తనను దుబాయ్ తీసుకెళ్లారని.. అక్కడే తనను వేధించారని యువతి ఫిర్యాదు చేసింది. ఈ ఘటన విదేశాల్లోనే జరిగిందని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. హీరో నివిన్ పౌలీతో పాటు మరికొందరు కూడా తనను చిత్రహింసలకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నెరియమంగళం ఒనుంకల్ పోలీసులు నమోదు చేసిన కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించనున్నట్లు సమాచారం. ఈ కేసులో ఆరుగురు నిందితులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నివిన్ పౌలీపై నమోదైన కేసు ముందుగా ఎర్నాకులం రూరల్ ఎస్పీకి చేరింది.

మలయాళీ ఇండస్ట్రీలో జస్టిస్ హేమ కమిటీ నివేదిక బయటకు వచ్చిన తర్వాత చాలా మంది నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను ధైర్యంగా ముందుకు వచ్చి చెబుతున్నారు. ఇప్పటికే మలయాళీ సీనియర్ నటులు ముఖేష్, సిద్ధిక్, దర్శకుడు రంజిత్ లతోపాటు మరికొందరి పై ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రధాన కార్యదర్శిగా సిద్ధిక్ రాజీనామా చేయడంతో అధ్యక్షుడు మోహన్‌లాల్ నేతృత్వంలోని కార్యవర్గం మూకుమ్మడిగా రాజీనామా చేసింది. దర్శకుడు రంజిత్ చలనచిత్ర అకాడమీ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. హేమా కమిటీ నివేదిక వెలువడిన తర్వాత వెల్లడైన వివరాల్లో ఎర్నాకులంలో నమోదైన కేసుల సంఖ్య 11కి చేరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఓటీటీలోకి వచ్చేసిన ఇనయా సుల్తానా క్రైమ్ థ్రిల్లర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన ఇనయా సుల్తానా క్రైమ్ థ్రిల్లర్ మూవీ
హైదరాబాద్‌ నగర వీధుల్లో పరుగులు తీస్తున్న ఖరీదైన చేపలు.. వీడియో
హైదరాబాద్‌ నగర వీధుల్లో పరుగులు తీస్తున్న ఖరీదైన చేపలు.. వీడియో
వరదలో చిక్కుకున్న గిరిజనలను రక్షించిన పోలీసులు.. సర్వత్రా హర్షం
వరదలో చిక్కుకున్న గిరిజనలను రక్షించిన పోలీసులు.. సర్వత్రా హర్షం
ఇకపై 9 గంటలే.! శ్రీలంకకు విమానం లాంటి ప్రయాణం.. ఎలాగంటారా
ఇకపై 9 గంటలే.! శ్రీలంకకు విమానం లాంటి ప్రయాణం.. ఎలాగంటారా
ఆ స్టార్ హీరోపై వేధింపుల కేసు..
ఆ స్టార్ హీరోపై వేధింపుల కేసు..
శభాష్ పోలీసన్న.. అధికారులను సన్మానించిన సీఎం రేవంత్ రెడ్డి
శభాష్ పోలీసన్న.. అధికారులను సన్మానించిన సీఎం రేవంత్ రెడ్డి
హెల్తీ ఫుడ్ అంటే ఏంటి.? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చేబుతోంది..
హెల్తీ ఫుడ్ అంటే ఏంటి.? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చేబుతోంది..
ముద్దు పెట్టుకున్నప్పుడు సెల్ఫీ తీసుకోవాలా..? ప్రూఫ్స్ ఎలా తేవాలి
ముద్దు పెట్టుకున్నప్పుడు సెల్ఫీ తీసుకోవాలా..? ప్రూఫ్స్ ఎలా తేవాలి
ఇలాంటి క్రికెట్ కమెంటరీని ముందెప్పుడూ వినుండరు.. వైరల్ వీడియో
ఇలాంటి క్రికెట్ కమెంటరీని ముందెప్పుడూ వినుండరు.. వైరల్ వీడియో
అనుకూలంగా లేని శుభ గ్రహాలు.. వారికి ఈ పరిహారాలు అవసరం..!
అనుకూలంగా లేని శుభ గ్రహాలు.. వారికి ఈ పరిహారాలు అవసరం..!