AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్‌, రాజమౌళి మూవీ టైటిల్ అదేనా.? వైరల్‌ అవుతోన్న ఫొటో..

ఈ నేపథ్యంలో సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుతో సినిమా చేయనున్నట్లు రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అటు మహేష్‌ కానీ, ఇటు రాజమౌళి కానీ ఈ కొత్త సినిమా కథకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఈసారి రాజమౌళి ఎలాంటి కథంశాన్ని ఎంచుకోనున్నారు.? తెరపై మహేష్‌ను ఎలా చూపించనున్నారనే....

Mahesh Babu: మహేష్‌, రాజమౌళి మూవీ టైటిల్ అదేనా.? వైరల్‌ అవుతోన్న ఫొటో..
Rajamouli Mahesh
Narender Vaitla
|

Updated on: Aug 24, 2024 | 8:21 AM

Share

రాజమౌళి నుంచి ఏదైనా కొత్త మూవీ వస్తుందంటే చాలు ఇప్పుడు అది ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో ఒక హాట్‌ టాపిక్‌. రాజమౌళి ఎలాంటి వండర్‌ క్రియేట్ చేయనున్నాడో అని చర్యనీయాంశంగా మారుతోంది. బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న.. ట్రిపులార్‌తో ఏకంగా ఇంటర్నేషనల్ రేంజ్‌కు తీసుకెళ్లారు. దీంతో ట్రిపులార్‌ తర్వాత రాజమౌళి చేయనున్న సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుతో సినిమా చేయనున్నట్లు రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అటు మహేష్‌ కానీ, ఇటు రాజమౌళి కానీ ఈ కొత్త సినిమా కథకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఈసారి రాజమౌళి ఎలాంటి కథంశాన్ని ఎంచుకోనున్నారు.? తెరపై మహేష్‌ను ఎలా చూపించనున్నారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫొటో సినిమా టైటిల్‌కు సంబంధించి చర్చకు తెర తీసింది.

ఈ సినిమాకు విజువల్ డెవలపర్‌గా పనిచేస్తున్న టీపీ విజయన్ తన ఇన్‌స్టా స్టోరీలో ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. గోల్డ్‌ కలర్‌లో ఉన్న గద్ద రెక్కల ఫొటోను పోస్ట్‌ చేసిన విజయన్‌.. దాంతో పాటు #SSMB29, #SSMB29DIARIES అనే హ్యాష్‌ ట్యాగ్స్‌ రాసుకొచ్చారు. దీంతో మహేష్‌-రాజమౌళి సినిమా టైటిల్‌ ‘గరుడ’ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. నిజానికి గతంలో రాజమౌళి సైతం.. గతంలో ఓసారి గరుడ అనే మూవీ చేస్తానని తెలిపారు. దీంతో ఇప్పుడీ గరుడ, ఆ గరుడయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి.

Mahesh Babu

అయితే చిత్ర యూనిట్ ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఇదే విజయన్‌ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. మహేష్‌-రాజమౌళి సినిమా 2028లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని. ఇన్ని రోజులు ఎదురు చూసిన దానికి కచ్చితంగా మంచి ఫలితం ఉంటుందని ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా మహేష్‌ ఈ సినిమా కోసం తన లుక్‌ను మార్చేశాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..