AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : 18 ఏళ్లలో 450 చిత్రాలు.. హీరోయిన్ కాకపోయినా గ్లామర్ ప్రపంచాన్నే ఏలేసింది.. పెద్ద హీరోలను మించిన డిమాండ్..

14 ఏళ్ల వయసులోనే ఇల్లు వదిలేసింది. భర్త, అత్తింటి వేధింపులు భరించలేక ఇంటి నుంచి పారిపోయిన ఆమె సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఇండస్ట్రీలో దొరికిన ప్రతి చిన్న పని చేసుకుంటూ కొన్నాళ్లు జీవితాన్ని గడిపింది. కానీ కాలక్రమేణ ఆమమె దక్షిణా భారత సినిమాకు పట్టాభిషేకం లేని రాణిగా ఎదిగింది. ఇప్పటికీ ఆమె జీవితం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు.

Tollywood : 18 ఏళ్లలో 450 చిత్రాలు.. హీరోయిన్ కాకపోయినా గ్లామర్ ప్రపంచాన్నే ఏలేసింది.. పెద్ద హీరోలను మించిన డిమాండ్..
Silk Smitha
Rajitha Chanti
|

Updated on: Sep 30, 2026 | 4:49 PM

Share

భారతీయ సినిమా రంగంలో అత్యంత గ్లామరస్ నటీమణులలో ఒకరిగా ఎదిగిన నటి సిల్క్ స్మిత. చిన్న వయసులోనే పెళ్లి, భర్త, అత్తింటి వేధింపులు భరించలేక 14 ఏళ్ల వయసులోనే ఇంటి నుంచి పారిపోయింది. తనను తాను పోషించుకోవడానికి సినీరంగంలో దొరికిన ప్రతి పనిని చేసింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఊహించని విధంగా ఆమె లైఫ్ మారిపోయింది. ఆమె దక్షిణాది చిత్ర పరిశ్రమను కుదిపేసిన అసమానమైన బాక్సాఫీస్ స్టార్ గ్లామర్ క్వీన్ గా మారారు. కానీ జీవితం ఒకేలా ఉండదు కదా.. ఆమె ప్రేమించిన వారి మోసం తట్టుకోలేక ఆస్తులు పోగొట్టుకుంది. అంతకు మించి ప్రేమ కోసం పరితపించిన ఆమె ఆ ప్రేమ చేసిన మోసానికే బలైంది. 35 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకుని ఈ లోకాన్ని విడిచిపెట్టింది.

సిల్క్ స్మిత జీవితం ఆమె అద్భుతమైన పోరాట స్ఫూర్తికి, అచంచలమైన దుఃఖానికి సజీవ నిదర్శనం. ఆమె జీవితం ఆధారంగా బాలీవుడ్ నటి విద్యా బాలన్ నటించిన ది డర్టీ పిక్చర్ సినిమా జాతీయ అవార్డ్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అగ్ర హీరోలు ఆధిపత్యం చెలాయించిన ఆరోజుల్లోనే.. ఒక పేద గ్రామీణ కుటుంబం నుంచి వచ్చి స్టార్ హీరోహీరోయిన్లను మించిన స్టార్ డమ్ సంపాదించుకుంది. ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకోవడం ఆరోజుల్లో ఊహించలేని విషయం. 1980వ, 90వ దశకాల తొలిదశలో భారతీయ సినిమా రంగంలో గ్లామర్ క్వీన్ గా మారిపోయింది. కానీ నిజ జీవితంలో మాత్రం తీరని కన్నీళ్లు ఆమెను ఒంటరిని చేశాయి.

10 సంవత్సరాల వయస్సులో బడి మానేసిన ఆమెకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు తల్లిదండ్రులు. 14 సంవత్సరాల వయస్సులో, ఆమె తల్లిదండ్రులు ఆమెకు తెలియకుండానే తనకంటే పెద్దవాడైన ఒక వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. భర్త, అత్తమామల నుండి అత్యంత దారుణమైన శారీరక, మానసిక వేధింపులను భరించిన ఆ మహిళ, రెండేళ్ల నరకప్రాయమైన జీవితం తర్వాత సర్వం వదిలి చెన్నైకి పారిపోయింది. తన అత్త సహాయంతో చెన్నైకి వచ్చిన విజయలక్ష్మి, కుటుంబాన్ని పోషించుకోవడానికి మొదట గృహ కార్మికురాలిగా, ఆ తర్వాత టచ్-అప్ ఆర్టిస్ట్‌గా పనిచేసింది. నటుడు విను చక్రవర్తి చెన్నైలోని ఏవీఎం స్టూడియోస్ సమీపంలో ఉన్న ఒక పిండి మిల్లులో స్మితను మొదటిసారిగా గమనించారు. స్మిత అందానికి, ఆకర్షణకు ముగ్ధుడైన విను వెంటనే ఆమెకు నటనలో శిక్షణ ఇచ్చారు. ఆంథోనీ ఈస్ట్‌మన్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ‘ఇనైయే తేడి’తో స్మిత సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక స్పెషల్ సాంగ్స్ చేసి గ్లామర్ ప్రపంచాన్ని ఏలింది. సిల్క్ స్మిత తన 18 ఏళ్ల సినీ కెరీర్‌లో 450కి పైగా చిత్రాలలో నటించింది. అప్పట్లో ఆమె ఒక్క పాటకు రూ.50 వేలు వసూలు చేసింది. ఆరోజుల్లో అది అత్యధిక రెమ్యునరేషన్. స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువే. 1990వ దశాబ్దం చివరి నాటికి, ఆమె స్టార్‌డమ్ తగ్గడం ప్రారంభమైంది. ఆమె 4 కోట్ల రూపాయలకు పైగా అప్పుల్లో కూరుకుపోయి, తాను కష్టపడి సంపాదించిన ఆస్తులన్నింటినీ కోల్పోయింది. సిల్క్ స్మిత 1996 సెప్టెంబర్ 23న చెన్నైలోని తన ఇంట్లో విగతజీవిగా కనిపించింది. దీనిని ఆత్మహత్యగా నిర్ధారించినప్పటికీ, మూడు దశాబ్దాలు గడిచినా ఆమె మరణం వెనుక ఉన్న రహస్యాలు , ప్రశ్నలకు సమాధానం లభించలేదు.

ఇవి కూడా చదవండి

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఈ సినిమాకు ఏం డిమాండ్ రా బాబూ.. ఓటీటీలో గత్తరలేపుతున్న మూవీ.. ఫ్యామిలీతో అస్సలు చూడలేరు..

సిల్మ్ స్మిత..

Silk Smitha

Silk Smitha

ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో నాకు బెస్ట్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు.. నయనతార..

Follow Us
‘CO2 గన్ పెట్టుకోండి’.. మహిళలకు మేజర్ ఖుష్బూ పటానీ సలహా వైరల్!
‘CO2 గన్ పెట్టుకోండి’.. మహిళలకు మేజర్ ఖుష్బూ పటానీ సలహా వైరల్!
ఈ వారం బిగ్‌బాస్ నామినేషన్స్‌లో ఏకంగా 9 మంది.. బయటకు వెళ్లేదెవరో!
ఈ వారం బిగ్‌బాస్ నామినేషన్స్‌లో ఏకంగా 9 మంది.. బయటకు వెళ్లేదెవరో!
ఫోన్ నంబర్ లింక్ చేయకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందా?
ఫోన్ నంబర్ లింక్ చేయకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందా?
హీరోయిన్లను మించిన ఫాలోయింగ్.. హీరోలకే షాకిచ్చిన గ్లామర్ క్వీన్ ఆ
హీరోయిన్లను మించిన ఫాలోయింగ్.. హీరోలకే షాకిచ్చిన గ్లామర్ క్వీన్ ఆ
ఆటో డ్రైవర్‌ను వదలని రామచిలుకలు.. ఇంటి మిద్దెపై చేరి..
ఆటో డ్రైవర్‌ను వదలని రామచిలుకలు.. ఇంటి మిద్దెపై చేరి..
విజయవాడ జంక్షన్‌లో రైళ్ల రద్దీకి చెక్..
విజయవాడ జంక్షన్‌లో రైళ్ల రద్దీకి చెక్..
కుంభరాశి అక్టోబర్ ఫలితాలు..పాత రహస్యాలు వెళ్లడి..బంధంలో కొత్తమలపు
కుంభరాశి అక్టోబర్ ఫలితాలు..పాత రహస్యాలు వెళ్లడి..బంధంలో కొత్తమలపు
త్వరలోనే రంగంలోకి స్మార్ట్ ఏఐ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్..
త్వరలోనే రంగంలోకి స్మార్ట్ ఏఐ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్..
యమహా లవర్స్‌కు షాక్.. ఆ పాపులర్ బైక్‌ బైక్ నిలిపివేత?
యమహా లవర్స్‌కు షాక్.. ఆ పాపులర్ బైక్‌ బైక్ నిలిపివేత?
వామ్మో.. గంటన్నర పాటు పడగ విప్పి నిల్చున్న నాగుపాము
వామ్మో.. గంటన్నర పాటు పడగ విప్పి నిల్చున్న నాగుపాము