CEC Bengal polls review: నేటితో ముగిసిన బెంగాల్ ఏడో విడత ఎన్నికల ప్రచారం.. కొవిడ్‌ నిబంధనల అమలుపై సీఈసీ సమీక్ష

దేశవ్యాప్తంగా కరోనా మహోగ్రరూపం దాల్చుతున్న వేళ పశ్చిమ బెంగాల్ ఎన్నికల నిర్వహణపై కేంద్ర సంఘం అత్యవసర సమావేశం నిర్వహించింది. ఎన్నికల ప్రచారంలో కొవిడ్‌ నిబంధనల అమలుపై కేంద్ర సీఈసీ సుశీల్‌ చంద్ర సమీక్షించారు.

CEC Bengal polls review: నేటితో ముగిసిన బెంగాల్  ఏడో విడత ఎన్నికల ప్రచారం.. కొవిడ్‌ నిబంధనల అమలుపై సీఈసీ సమీక్ష
Cec Sushil Chandra
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 24, 2021 | 4:41 PM

CEC top brass reviews దేశవ్యాప్తంగా కరోనా మహోగ్రరూపం దాల్చుతున్న వేళ పశ్చిమ బెంగాల్ ఎన్నికల నిర్వహణపై కేంద్ర సంఘం అత్యవసర సమావేశం నిర్వహించింది. బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కొవిడ్‌ నిబంధనల అమలుపై కేంద్ర సీఈసీ సుశీల్‌ చంద్ర, ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ శనివారం సమీక్షించారు. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఆరోగ్యశాఖ కార్యదర్శి, కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌తో మార్గదర్శకాల అమలుపై ఈసీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించినట్లు పోల్‌ ప్యానెల్‌ ప్రతినిధి తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది.

294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలను 8 దశల్లో పోలింగ్ నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటివరు ఆరు దశల పోలింగ్ విజయవంతంగా పూర్తి అయ్యింది. ఈ నెల 26న ఏడో విడుత, 29న ఎనిమిది విడుత పోలింగ్‌ జరుగనుంది. వచ్చే నెల 2న ఫలితాలు వెలువడి కానున్నాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రచారం సభలు, సమావేశాలపై ఈసీ ప్రత్యేక ఆంక్షలు విధించింది.ఇటీవలే ఎన్నికల సంఘం ర్యాలీలు, పాదయాత్రలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. బహిరంగ సభలకు హాజరయ్యే జనం సంఖ్యను 500కు పరిమితం చేసింది.

ఇదిలావుంటే, పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో కొవిడ్‌ 19 భద్రతా నిబంధనలు అమలు చేయడంలో ఈసీ తీరుపై కోల్‌కతా హైకోర్టు సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also… కోవిడ్ డ్యూటీలో 4 నెలల గర్భంతో నర్సు , ఉపవాస దీక్ష పాటిస్తూనే రోగులకు సేవలు

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే