కూచ్ బిహార్ జిల్లాలోని సీతల్‌కూచి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు పర్యాయాల నుంచి అధికార పార్టీ టీఎంసీ విజయం సాధిస్తూ వస్తోంది. ప్రస్తుతం టిఎంసికి చెందిన హిటెన్ బర్మన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2011లో కూడా ఆయన గెలిచారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం నమదీపతిని సుమారు 15 వేల ఓట్ల తేడాతో ఓడించారు. హిటెన్కు లక్ష ఓట్లు, నమదీపతికి 86 వేల ఓట్లు వచ్చాయి. బీజేపీ ఇక్కడ మూడవ స్థానంలో నిలిచింది. అయితే సీతల్ కూచి అసెంబ్లీ సీటును ఎస్సీకి కేటాయించారు. 1962లో మొదటిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్‌కు చెందిన బిజోయ్ కుమార్ గెలుపొందారు. అప్పటి నుంచి 2011 వరకు సీపీఎం గెలుపొందుతూ వస్తోంది. 2011లో జరిగిన ఎన్నికలలో టీఎంసీ నుంచి హిటెన్ బర్మన్ పోటీ చేసి సిపిఎం విశ్వనాథ్‌ను ఓడించారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,63,84.