AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati Loksabha by-poll: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీల దృష్టి.. ప్రత్యేక వ్యుహంతో టీడీపీ

తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో జోరు పెంచాయి.

Tirupati Loksabha by-poll: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీల దృష్టి.. ప్రత్యేక వ్యుహంతో టీడీపీ
Telugu Desam Party Focus On Tirupati Lok Sabha By Election
Balaraju Goud
|

Updated on: Mar 26, 2021 | 9:31 AM

Share

Tirupati by-poll 2021: తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో జోరు పెంచాయి. ముఖ్యంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న తెలుగుదేశం పార్టీ తిరుపతి ఉప ఎన్నికను సవాల్ స్వీకరిస్తోంది. బైపోల్ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తోంది. ప్రచార సరళిని మార్చిన టీడీపీ అగ్ర నాయకత్వం.. సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, స్థానిక సమస్యలపై ఇంటింటి ప్రచారం చేయాలని నిర్ణయించింది.

తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ అకాల మరణంతో.. త్వరలో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్, పంచాయతీ ఎన్నికల ఫలితాల తో డీలాపడిన టీడీపీ.. ఆ వెంటనే వచ్చిన తిరుపతి ఉప ఎన్నికల్లో సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ ఎన్నిక లో తెగించి పోరాడాలని.. ప్రతి ఒక్కరూ సీరియస్‌గా తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రచార సరళి ని మార్చుతున్నారు.. అందరి కంటే ముందే అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ.. ఇంటింటి ప్రచారం చేయాలని ప్రతి 50 కుటుంబాలకు ఒక కార్యకర్తను నియమించనుంది. అంతేకాదు, టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో, లోకేష్ బైక్ యాత్ర ద్వారా ప్రచారం చేయాలని ట భావిస్తోంది.. టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, సీనియర్ నేత యనమల రామకృష్ణుడితో సహా ప్రతి ఒక్క నేత ప్రచారంలో ఉండాలని చంద్రబాబు సూచించారు..

తెలుగు దేశం పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి ఇప్పటికే నామినేషన్ వేసి.. ఇంటింటికి ప్రచారం మొదలుపెట్టారు. పనబాక లక్ష్మి గతంలో నెల్లూరు నుంచి రెండు సార్లు, బాపట్ల నుంచి ఒక సారి ఆమె 3 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. యూపీఏ హయాంలో 10 సంవత్సరాలు కేంద్ర మంత్రి గా పనిచేశారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ,జౌళి తదితర మంత్రిత్వ శాఖలను ఆమె నిర్వర్తించారు. ఇలా కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన పనబాక లక్ష్మి మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2019లో టీడీపీలో చేరి తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే..ఒక్కో నియోజకవర్గాన్ని పది క్లస్టర్లు గా మొత్తం 70 క్లస్టర్లు గా విభజించారు. ఒక్కో నియోజకవర్గానికి మాజీమంత్రి ఇన్‌ఛార్జ్‌గా నియమించింది టీడీపీ. అలాగే, క్లస్టర్‌కు ఒక సీనియర్ నేత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలను ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. చంద్రబాబు రోడ్ షోలు, లోకేష్ బైక్ యాత్ర ద్వారా ప్రచారం నిర్వహించేలా పార్టీ నేతలు భావిస్తున్నారు. వారి ప్రచారం ఎలా ఉండాలనే రూట్ మ్యాప్ త్వరలో ఖరారు అవుతుందని నేతలు అంటున్నారు..

మరోవైపు, ఇంటింటి ప్రచారం నిర్వహించాలని టీడీపీ సన్నద్ధం అవుతోంది.. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు,స్థానిక సమస్యలపై ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. వైసీపీ వాలంటీర్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని ,ఓటర్లని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉన్నట్లే.. టీడీపీ కూడా తిరుపతి ఎన్నికల్లో ప్రతి 50 కుటుంబాలకు ఒక కార్యకర్తను నియమించాలని ఆ పార్టీ ఆలోచన చేస్తోంది. ఇందుకోసం కరపత్రాలు రూపొందించి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది.

ఇదిలావుంటే, ప్రచారంతో పాటు వైసీపీని చట్టపరంగా ఎదుర్కొనేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక న్యాయవాదిని అందుబాటులో ఉంచాలని భావిస్తోంది. ఎన్నికల కోడ్ ఉల్లంగించే వాలంటీర్లు ,ప్రభుత్వ ఉద్యోగులపై లీగల్ సెల్ ద్వారా పిర్యాదు చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది.. మొత్తం ప్రచారం ,నిర్వహణ ని మానిటరింగ్ చేసేందుకు పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ, టీడీ జనార్దన్, వర్ల రామయ్య, అశోక్‌బాబులతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి బాధ్యతలు అప్పగించారు. ఎలాగైనా తిరుపతి లోక్‌సభ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు తెలుగు దేశం పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

Read Also…  కన్నడనాట రాసలీలల వ్యవహారం మరో ట్విస్ట్.. రెండో సీడీని విడుదల చేసిన యువతి.. అందులో ఏముందంటే..?