Tamil Nadu Elections 2021: అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ మృతిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కూతుళ్లు..
Tamil Nadu Elections 2021: తమిళనాట నేతలు హద్దులు మీరుతున్నారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారు. ప్రత్యర్థులపై హాట్ కామెంట్స్..
Tamil Nadu Elections 2021: తమిళనాట నేతలు హద్దులు మీరుతున్నారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారు. ప్రత్యర్థులపై హాట్ కామెంట్స్ చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు. ఎన్నికల వేళ నోరు జారుతూ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు డీఎంకే నేతలు. డీఎంకే ఎంపీ ఏ. రాజా..సీఎం పళనిస్వామిపై చేసిన అనుచిత వ్యాఖ్యల రగడ చల్లారకముందే.. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ తనయుడు, యువనేత ఉదయనిధి స్టాలిన్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. ఏకంగా ప్రధాని మోదీనే టార్గెట్ చేశారు. మోదీ టార్చర్ భరించలేకే సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ చనిపోయారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీనియర్లంటే ప్రధాని మోదీకి ఏ మాత్రం గౌరవం లేదంటూ వ్యాఖ్యానించారు.
తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సీనియర్లంటే ఏమాత్రం గౌరవం లేదు. ఆయన వేధింపుల కారణంగా కేంద్ర మాజీ మంత్రులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ ప్రాణాలు కోల్పోయారు. బీజేపీలో మరో కీలక నేత అయిన వెంకయ్య నాయుడిని కూడా పక్కకు తప్పించారు.’’ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు.. ‘‘మిస్టర్ మోదీ.. మీమ్మల్ని చూసి భయపడటానికి, చేతులు కట్టుకుని నిల్చోడానికి నేనేమీ పళనిస్వామిని కాదు. నేను కలైంగర్ మనవడిని, ఉదయనిధి స్టాలిన్‌ని.’’ అని ఘాటైన పదజాలంతో ప్రసంగించారు.
ఐతే స్టాలిన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు సుష్మా, అరుణ్ జైట్లీ కుటుంబ సభ్యులు. రాజకీయాల కోసం తమ కుటుంబాలను వాడుకోవద్దని ట్వీట్స్ చేశారు. ‘ప్రధాని మోడీ జీ తమ తల్లికి ఎంతో గౌరవం ఇచ్చారని, కీలక సమయంలో ప్రధాని, బీజేపీ తమ కుటుంబానికి అండగా నిలిచింది. మీరు చేసిన వ్యాఖ్యలు మమ్మల్ని తీవ్రంగా బాధించాయి.’’ అంటూ సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్ మండిపడ్డారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆమె.. ఉదయనిధి స్టాలిన్ ట్విట్టర్ అకౌంట్‌ని ట్యాగ్ చేశారు. మోదీ, అమిత్ షా తమతో ఎలా ఉంటారో మాకు తెలుసునని.. ఉదయనిధి వ్యాఖ్యలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదే సమయంలో అరుణ్ జైట్లీ కుమార్తె సోనాలి జైట్లీ బక్షి కూడా ఉయదనిధి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ‘‘ఉదయ స్టాలిన్ గారూ.. మీపై ఎన్నికల ఒత్తిడి ఉందని నాకు తెలుసు. కాని మీరు అబద్ధాలు చెప్పి నా తండ్రిని అగౌరవపరిచారు. దీన్ని నేను సహించలేను. నా తండ్రి అరుణ్ జైట్లీ, మోదీ మధ్య రాజకీయాలకు మించిన స్నేహం ఉంది. వారి గురించి కామెంట్స్ చేసే ముందు.. వారి స్నేహం గురించి తెలుసుకుంటే మంచిది.’’ అన్నారు.
ఇదిలాఉండగా.. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై చేసిన వ్యాఖ్యలకు రాజా క్షమాపణలు చెప్పినా ఆ వివాదం ఇంకా చల్లారలేదు. సీఎం పళనిస్వామిపై రాజా వ్యాఖ్యలను ఖండించిన ఈసీ..48 గంటలపాటు ఆయన ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించింది. అంతేకాదు డీఎంకే స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి ఎ.రాజాను తొలగించింది. ఇక ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సుష్మా, జైట్లీ కుటుంబసభ్యుల ఆగ్రహానికి గురయ్యారు. మరి ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందోనన్నది తమిళనాట చర్చనీయాంశంగా మారింది.
Also read:
ESIC Recruitment 2021: ఇంటర్, డిగ్రీ అర్హత ఉందా..! భారీ వేతనాలతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్..