ఎన్నికల్లో ఆ రాజా వారిని ప్రచారం చేయకుండా చూడండి, ఈసీకి అన్నాడీఎంకే విజ్ఞప్తి..
తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి ఎ. రాజా ప్రచారం చేయకుండా చూడాలని అన్నాడీఎంకే..ఎలెక్షన్ కమిషన్ ను కోరింది. సీఎం పళనిస్వామిపై ఆయన అనుచితమైన...
తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి ఎ. రాజా ప్రచారం చేయకుండా చూడాలని అన్నాడీఎంకే..ఎలెక్షన్ కమిషన్ ను కోరింది. సీఎం పళనిస్వామిపై ఆయన అనుచితమైన, అసభ్య వ్యాఖ్యలు చేశారని ఈ పార్టీ అడ్వొకేట్ విభాగం సంయుక్త కార్యదర్శి సి. తిరుమారన్ ఈ మేరకు ఈసీకి మెమొరాండం సమర్పించారు. పళనిస్వామి…. డీఎంకే అధినేత స్టాలిన్ చెప్పు కన్నా అధముడని, లోగడ బెల్లం మార్కెట్ లో పని చేసే పళని.. లూటీ చేసిన నిధులతో తనను, తన పార్టీ ని అడ్డు పెట్టుకుని ఎవరినైనా ఎదిరిస్తారని రాజా ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన ప్రముఖ నాయకుల పేర్లను శాతం ప్రస్తావిస్తూవారిని కూడా పళని స్వామి సవాల్ చేస్తున్నారని అన్నారు. పళని పుట్టుకపై కూడా ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై సీఎం పళనిస్వామి తాను పేద రైతు కుటుంబం నుంచి వచ్చానని, వారి కష్టాలు తనకు తెలుసునని పేర్కొన్నారు. అలాగే గతంలో లక్షా 76 వేల కోట్ల స్కామ్ వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలుసునని కూడా ఆయన ఎద్దేవా చేశారు . 2జీ స్పెక్ట్రమ్ కేసులో రాజా ‘విముక్తుడైన’ విషయం తెలిసిందే.
ఈ ఎన్నికల్లో రాజా ఇంకా ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేస్తుంటారని, ఈ కారణంగా ఈయనను ప్రచారం చేయకుండా నివారించాలని అడ్వొకేట్ తిరుమారన్ అభ్యర్థించారు. దీన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఎలెక్టోరల్ ఆఫీసర్ ఆయనకు హామీ ఇఛ్చారు. అటు తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కూటమి పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నాయి. అలాగే డీఎంకే- కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి. కాంగ్రెస్ 25 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక ప్రచారాల్లో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. నిన్నటికినిన్న బీజేపీ అభ్యర్థి, నటి ఖుష్బూ సుందరం దోసెలు వేసిన విషయం గమనార్హం.
మరిన్ని చదవండి ఇక్కడ:టీనేజ్ కూతురితో మజాక్ చేస్తున్న నటి ప్రగతి.. వైరల్ అవుతున్న వీడియో : Actor Pragathi Viral Video.
బాతుపిల్లకు సాయంచేసిన మనసున్న మృగరాజు వీడియో.. ముచ్చట పడుతున్న నెటిజన్లు : Lion And Duck Video.