ఎన్నికల్లో టికెట్ లభించలేదని కేరళ మహిళా కాంగ్రెస్ చీఫ్ వినూత్న నిరసన, రాజీనామా, శిరోముండనం
కేరళలో తమ పార్టీని షాక్ కి గురి చేస్తూ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లతికా సుభాష్ వినూత్న నిరసన తెలిపారు. ఆమె తన పదవికి రాజీనామా చేయడమే గాక శిరోముండనం చేయించుకున్నారు.
కేరళలో తమ పార్టీని షాక్ కి గురి చేస్తూ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లతికా సుభాష్ వినూత్న నిరసన తెలిపారు. ఆమె తన పదవికి రాజీనామా చేయడమే గాక శిరోముండనం చేయించుకున్నారు. ఎత్తుమన్నూర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయగోరారు. కానీ లిస్టులో తన పేరు లేకపోవడంతో ఆమె ఆగ్రహించి పార్టీ కార్యాలయం ముందే శిరోముండనం చేయించుకున్నారు. కేరళ ఎన్నికలకు కాంగ్రెస్ ఆదివారం తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్ ఢిల్లీలో ఈ జాబితాను రిలీజ్ చేస్తూ మహిళా అభ్యర్థులు తగినంతమంది లేరని చెప్పడం విశేషం.టికెట్ లభించనందుకు ఒక అభ్యర్థి ముఖ్యంగా ఓ మహిళా నేత ఇలా రాజీనామా చేయడమే గాక శిరోముండనం చేయించుకోవడం ఇదే మొదటిసారి. అటు- 92 సీట్లకు గాను 86 మంది అభ్యర్థుల పేర్లతో ఈ జాబితా విడుదల అయింది.
ఇలా ఉండగా మాజీ సీఎం ఊమెన్ చాందీ. అసెంబ్లీలో విపక్ష నేత రమేష్ చెన్నితాల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఊమెన్ చాందీ పుత్తుపల్లి నుంచి, రమేష్ చెన్నితాల హరిపాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. నటుడు ధర్మాజన్ కోజీకోడ్ జిల్లా బలుసారి నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఇలా ఉండగా కేరళ కాంగ్రెస్ లో ముఠా రాజకీయాలు పెరిగిపోయాయని నిరసన వ్యక్తం చేస్తూ సీనియర్ నేతలు పీసీ చాకో, విజయన్ థామస్ తమ పదవులకు రాజీనామాలు చేశారు. చాకో అయితే ఏకంగా పార్టీ హైకమాండ్ పైనే నిప్పులు చెరిగారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ప్రస్తావించకుండా అయన.. ఈ రాష్ట్ర పార్టీలో ముఠాతత్వం పెరిగిపోయినా కొందరు అగ్రనేతలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని తన రాజీనామా లేఖలో ఆరోపించారు. మరిన్ని చదవండి ఇక్కడ : సింహం ప్రాంక్ వీడియో వైరల్.. నిజం తెలిసి నవ్వులే నవ్వులు..! Viral Video