Karnataka Elections: కర్ణాటక ఓట్ల లెక్కింపు వేళ.. బీజేపీ కార్యాలయంలోకి ప్రవేశించిన పాము

| Edited By: Ram Naramaneni

May 13, 2023 | 12:33 PM

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బీజేపీ కాంగ్రెస్ పార్టీ ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఇప్పటికే పూర్తయిపోయింది. ఈ లెక్కన చూస్తే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ పార్టీ ఫలితాల వివరాలు స్పష్టంగా తెలియాలంటే ఇంకా కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Karnataka Elections: కర్ణాటక ఓట్ల లెక్కింపు వేళ.. బీజేపీ కార్యాలయంలోకి ప్రవేశించిన పాము
Snake
Follow us on

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బీజేపీ కాంగ్రెస్ పార్టీ ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఇప్పటికే పూర్తయిపోయింది. ఈ లెక్కన చూస్తే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ పార్టీ ఫలితాల వివరాలు స్పష్టంగా తెలియాలంటే ఇంకా కొన్ని గంటలు వేచి చూడాల్సిందే. కర్ణాటకలో ఏ పార్టీ గెలుస్తుందోనన్న ఉత్కంఠ కన్నడ ప్రజలకే కాదు.. దేశవ్యా్ప్తంగా ఆసక్తి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై వరుసగా నాలుగోసారి ఎన్నికల బరిలోకి దిగిన షిగ్గావ్ నియోజకవర్గంలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది.

ఆ నియోజకవర్గంలో బీజేపీ క్యాంపు కార్యలయం ప్రాంగణంలోకి ఓ పాము ప్రవేశించి హల్‌చల్ చేసింది. దీంతో అక్కడున్న పార్టీ నేతలంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇది గమనించిన సిబ్బంది వెంటనే పామును పట్టుకున్నారు. ఆ తర్వాత దాన్ని చెట్ల పొదల్లోకి వదిలిపెట్టారు. పాము ప్రవేశించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వార్తలు చదవండి..