AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka Election Results: కాంగ్రెస్ పార్టీలో సీఎం ‘కుర్చీ ఫైట్‌’.. హస్తం పార్టీకి కొత్త టెన్షన్

Karnataka Congress: ఒక పార్టీ ఇద్దరు నేతలు..? ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి..? పార్టీ పెద్దల్లో హై టెన్షన్ నెలకొంది. కర్నాటక ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తుండటంతో అధిస్థానం మల్లగుల్లాలు పడుతోంది.

Karnataka Election Results: కాంగ్రెస్ పార్టీలో సీఎం 'కుర్చీ ఫైట్‌'.. హస్తం పార్టీకి కొత్త టెన్షన్
Karnataka Congress
Sanjay Kasula
|

Updated on: May 13, 2023 | 11:32 AM

Share

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం పెరిగింది. ముందస్తు ఫలితాన్ని బట్టి ఇప్పుడు కాంగ్రెస్ శిబిరంలో సంబరాలు మిన్నంటున్నాయి. ఓ వైపు కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీ దిశగా దూసుకుపోతుండటంతో కాంగ్రెస్ పార్టీలో మరో టెన్షన్ మొదలైంది. అయితే, ముఖ్యమంత్రి ఎవరన్న చర్చ కర్నాటకలో జోరుగా సాగుతోంది. ముఖ్యమంత్రి ఎంపికపై అయోమయంలో పడిన కాంగ్రెస్ హైకమాండ్, పార్టీ నేతలు ముందస్తు ఫలితాల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు.

కాంగ్రెస్‌ పార్టీలో అసెంబ్లీలో ప్రతి పక్ష నేత సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌లు ముఖ్యమంత్రి పదవిని బలంగా ఆశించేవారు. వరుణ నియోజకవర్గంలో శాసనసభా పక్ష నేత సిద్ధరామయ్య గెలిస్తే ముఖ్యమంత్రి పదవికి ఆయనే గట్టి పోటీదారు. అందుకు తగ్గట్టుగానే సిద్ధరామయ్య స్థానంలో తానే ముఖ్యమంత్రి కావాలని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇప్పటికే పార్టీ హైకమాండ్‌పై ఒత్తిడి తెచ్చారు.

ఓటింగ్‌పైనే ఎంపిక: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లలో ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలనే దానిపై కాంగ్రెస్ హైకమాండ్ ఉత్కంఠగా ఉంది. ఎన్నికల పూర్తి ఫలితాలు వెలువడిన తర్వాత శాసనసభలో ఎమ్మెల్యేల ఓటింగ్ ఆధారంగా ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం మంచిదన్న నిర్ణయానికి పార్టీ హైకమాండ్ వచ్చినట్లు తెలుస్తోంది.కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయాలని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా పట్టుబట్టారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఇష్టపడే వారినే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేయాలని సిద్ధరామయ్య హైకమాండ్‌పై ఒత్తిడి తెచ్చారని పార్టీ అగ్ర వర్గాలు అంటున్నాయి.

ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థుల మద్దతు కోసం మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సొంత నెట్‌వర్క్‌ల ద్వారా కసరత్తు చేసినట్లుగా తెలుస్తోంది. శాసనసభా పక్ష సమావేశంలో ఎన్నికల ద్వారా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోవడమే ఫైనల్ అయితే, సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లకు ఎమ్మెల్యేల ఒక్కో ఓటు తప్పనిసరి. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య వర్గం, డీకేసీ వర్గం ఒక్కో కాంగ్రెస్ అభ్యర్థి మద్దతు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక సహా కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను సులభతరం చేసేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు రణదీప్ సింగ్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్‌లను హైకమాండ్ ప్రతినిధులుగా పంపింది. ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బెంగళూరులో ఉన్నారు. ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియ, ప్రభుత్వ ఏర్పాటులో కూడా పాల్గొంటారు.

కర్నాటక పోలింగ్ ఫలితాలపై లైవ్ ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం