AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అందరి చూపు.. ఆమె వైపే.. ఒవైసీపై పోటీ చేసే మాధవీలత ఎవరంటే!

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ గతంలో కంటే ఎక్కువ 8 సీట్లు గెలిచి ఫుల్ జోష్ లోఉంది. ఇదే ఊపుతో పార్లమెంట్ స్థానాలను సగానికిపైగా గెలుచుకోవాలని ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే బీజేపీ నాయకత్వం కీలక అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే ఈసారి బీజేపీ ఓవైసీ కంచుకోటపై గురిపెట్టింది.

Hyderabad: అందరి చూపు.. ఆమె వైపే.. ఒవైసీపై పోటీ చేసే మాధవీలత ఎవరంటే!
Madhavi Latha
Balu Jajala
|

Updated on: Mar 06, 2024 | 6:56 PM

Share

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ గతంలో కంటే ఎక్కువ 8 సీట్లు గెలిచి ఫుల్ జోష్ లోఉంది. ఇదే ఊపుతో పార్లమెంట్ స్థానాలను సగానికిపైగా గెలుచుకోవాలని ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే బీజేపీ నాయకత్వం కీలక అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే ఈసారి బీజేపీ ఓవైసీ కంచుకోటపై గురిపెట్టింది. హైదరాబాద్ లోక్ సభ స్థానాన్ని 2004 నుంచి ఆ స్థానంలో ఉన్న మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ని ఓడించి ఆ స్థానం తమ ఖాతాలో వేసుకోవాలని ఫిక్స్ అయ్యింది భారతీయ జనతా పార్టీ.

అసదుద్దీన్ ఒవైసీ కంటే ముందు ఆయన తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ మొదట ఇండిపెండెంట్ గా, ఆ తర్వాత ఎంఐఎం నుంచి పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ అభ్యర్థి భగవంత్ రావు కంటే 3 లక్షల ఓట్లతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా ఓవైసీని ఓడగట్టాలనే ప్రయత్నంలో ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా, పార్టీ పోరాటాల్లో ప్రముఖంగా నిలిచిన ప్రొఫెషనల్ భరతనాట్య నృత్యకారిణి అయిన కొంపెల్ల మాధవీలతను బరిలో దింపింది.

ఆమె భర్త విశ్వనాథ్ హైదరాబాద్ కు చెందిన విరించి ఆసుపత్రి వ్యవస్థాపకుడు, చైర్మన్. లోపముద్ర చారిటబుల్ ట్రస్ట్, లతామా ఫౌండేషన్ తోనూ ఆమెకు అనుబంధం ఉంది. 49 ఏళ్ల ఈ అభ్యర్థి హైదరాబాద్ లో బీజేపీ బరిలోకి దిగిన తొలి మహిళా అభ్యర్థి. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చాలని ఆమె డిమాండ్ చేశారు.

గత ఏడాది కాలంగా పాతబస్తీ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదని ఎంఐఎంపై ఆమె విమర్శలు గుప్పించారు. గత ఏడాది కాలంగా ఓల్డ్ సిటీ ప్రాంతాలను సందర్శిస్తూ 11-12 గంటలు పనిచేశాను. పరిశుభ్రత లేదు, విద్య లేదు. మదర్సాల్లో పిల్లలకు తిండి దొరకడం లేదని, ముస్లిం పిల్లలు బాలకార్మికులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

‘పాతబస్తీ దయనీయ స్థితిలో ఉంది. ఇది కొండల్లో కాదు, గిరిజన ప్రాంతం కూడా కాదు. హైదరాబాద్ నడిబొడ్డున పేదరికం రాజ్యమేలుతోంది. ప్రజాస్వామ్యంలో 40 ఏళ్లుగా ఒక నియోజకవర్గం ఉంటే అభివృద్ధి చెంది ఉండాల్సింది. వారు రిటైర్మెంట్ తీసుకోవాలి. ఇది హిందూ-ముస్లింల పోరాటం కాదని, ఇది న్యాయం కోసం, నియోజకవర్గానికి నిజమైన లౌకిక అభివృద్ధి కోసం జరుగుతున్న పోరాటమని ఆమె అన్నారు. దీంతో ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు.