AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earth Lost Tons of Ice: గత 30 ఏళ్ల కంటే వేగంగా కరుగుతున్న మంచు.. మానవాళికి ప్రకృతి సరికొత్త హెచ్చరికను జారీ చేసిందా..!

రోజు రోజుకీ వాతావరణంలో వస్తున్న మార్పులతో భూమిపై ఉన్న మంచు వేగంగా కరిగిపోతుంది. 1994-2017 మధ్య 28 లక్షల కోట్ల టన్నుల మంచు కరిగిపోయిందని ఓ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. 30 ఏళ్ల క్రితం కంటే ఇప్పుడు మంచు వేగంగా..

Earth Lost Tons of Ice: గత 30 ఏళ్ల కంటే వేగంగా కరుగుతున్న మంచు.. మానవాళికి ప్రకృతి సరికొత్త హెచ్చరికను జారీ చేసిందా..!
Follow us
Surya Kala

|

Updated on: Jan 27, 2021 | 4:10 PM

Earth Lost Tons of Ice: రోజు రోజుకీ వాతావరణంలో వస్తున్న మార్పులతో భూమిపై ఉన్న మంచు వేగంగా కరిగిపోతుంది. 1994-2017 మధ్య 28 లక్షల కోట్ల టన్నుల మంచు కరిగిపోయిందని ఓ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. 30 ఏళ్ల క్రితం కంటే ఇప్పుడు మంచు వేగంగా కరుగుతుందని లండన్ కి చెందిన లీడ్స్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

1990ల్లో ఏడాదికి 0.8 ట్రిలియన్‌ టన్నులు మంచు కరిగి కనుమరుగైతే అదే 2017 నాటికి ఇది ఏడాది 1.3 ట్రిలియన్‌ టన్నులుగా ఉంది. యూకేలోని లీడ్స్‌ యూనివర్సిటీ బృందం శాటిలైట్‌ డేటా ఉపయోగించి ఈ అధ్యయనం నిర్వహించారు. గత 23 ఏళ్లలో మంచు కరిగే విధానం పరిశీలిస్తే..మంచు కరిగే వేగం 65 శాతం పేరిగిందని తేలింది. అంటార్కిటికా, గ్రీన్‌లాండ్‌లో ఐస్‌ షీట్లు కరిగిపోవడంతో మంచు కరిగే వేగం పెరిగినట్లు వివరించింది. ఈ సర్వేలో 2.15 లక్షల గ్లేసియర్లను అధ్యయనం చేశారు.

ఈ స్థాయిలో మంచు కరగడం వల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని, సముద్రతీర ప్రాంతాలు వరద ప్రభావానికి గురైతున్నట్లు వెల్లడించారు. దీంతో తీరప్రాంతాలు ముంపు ప్రమాదాన్ని ఎదుర్కోనున్నాయని పరిశోధకులు హెచ్చరించారు. మంచు ఇంత వేగంగా కడుగుతుంటే పర్యావరణంలో ఊహించని ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:  ఫ్రీ షీ షటిల్ బస్‌లను ప్రారంభించిన అనుష్క.. ప్రతి మహిళా పోలీస్ ఒక స్టార్ అని ప్రశంస