ఫేస్‌బుక్ మోసం.. మైనర్ బాలికకు రూ.11లక్షల టోకరా
సోషల్ మీడియా వచ్చాక.. దానిని సద్వినియోగం చేసుకునే వారికంటే.. దుర్వినియోగం చేసే వారే ఎక్కువయ్యారు. అమాయకులపై దుండగులు వల వేసి.. అడ్డంగా దోచేస్తున్నారు. తాజాగా ఫేస్‌బుక్ అడ్డాగా జరిగిన ఓ దారుణ మోసం బయటపడింది. రాజమండ్రికి చెందిన హేమంత్ సాయి అనే ఓ యువకుడు.. ఫేస్‌బుక్‌లో ఓ మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఆ బాలిక.. తన తండ్రి హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి చెందిన ఓ ఫ్రోఫెసర్ అని చెప్పడంతో.. ఆ యువకుడు పరిచయం మరింత పెంచుకున్నాడు. […]
సోషల్ మీడియా వచ్చాక.. దానిని సద్వినియోగం చేసుకునే వారికంటే.. దుర్వినియోగం చేసే వారే ఎక్కువయ్యారు. అమాయకులపై దుండగులు వల వేసి.. అడ్డంగా దోచేస్తున్నారు. తాజాగా ఫేస్‌బుక్ అడ్డాగా జరిగిన ఓ దారుణ మోసం బయటపడింది. రాజమండ్రికి చెందిన హేమంత్ సాయి అనే ఓ యువకుడు.. ఫేస్‌బుక్‌లో ఓ మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఆ బాలిక.. తన తండ్రి హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి చెందిన ఓ ఫ్రోఫెసర్ అని చెప్పడంతో.. ఆ యువకుడు పరిచయం మరింత పెంచుకున్నాడు. అంతేకాకుండా ఆ మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి.. రూ. 11 లక్షలు వసూలు చేశాడు. అనంతరం తన మిత్రులతో కలిసి.. ఆ మైనర్ బాలిక ఫోటోలు కొన్ని తీశాడు. వాటిని ఆ అమ్మాయి తండ్రికి పంపి.. రూ.40 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో ఆ బాలిక తండ్రి.. సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందుతుడిని అరెస్ట్ చేశారు.