AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ప్రేమిస్తున్నానంటూ.. పార్క్‌లో బాలికకు తాళికట్టిన యువకుడు.. ఆ తర్వాత ఏమైందంటే?

young man arrested: బాలికకు మాయమాటలు చెప్పాడు. అదే ప్రేమని నమ్మించాడు. తీరా ఆ బాలికను మోసం చేసి పార్కులోకి తీసుకువెళ్లి తాళికట్టిన యువకుడిపై హైదరాబాద్ బంజారాహిల్స్‌

Hyderabad: ప్రేమిస్తున్నానంటూ.. పార్క్‌లో బాలికకు తాళికట్టిన యువకుడు.. ఆ తర్వాత ఏమైందంటే?
Crime News
Shaik Madar Saheb
|

Updated on: May 20, 2021 | 11:29 PM

Share

young man arrested: బాలికకు మాయమాటలు చెప్పాడు. అదే ప్రేమని నమ్మించాడు. తీరా ఆ బాలికను మోసం చేసి పార్కులోకి తీసుకువెళ్లి తాళికట్టిన యువకుడిపై హైదరాబాద్ బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడలో నివాసముంటున్న బాలిక (16) ఇంటర్మీడియట్‌ చదువుతోంది. అదే ప్రాంతంలో నివాసముంటున్న రమేశ్‌ అనే యువకుడు ఏడాదికాలంగా ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంట పడుతున్నాడు. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి ఈ నెల 5న బాలికను కృష్ణకాంత్‌ పార్కుకు తీసుకువెళ్లి బలవంతంగా తాళి కట్టాడు. అదేరోజు ఆమెను వెంట తీసుకోని ఇంటికి వెళ్లాడు. ఈ సంఘటన విని రమేశ్‌ తల్లితో పాటు మేనత్త, ఇతర కుటుంబ సభ్యులు అతన్ని కొట్టి బయటకు తరిమేశారు. ఆతర్వాత బాలికను రమేష్ ఆమె ఇంటి దగ్గర వదిలిపెట్టాడు.

ఈ క్రమంలో… ఈ నెల 17న ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్న బాలికను గమనించిన తల్లి ఏం జరిగిందని ఆరా తీసింది. దీంతో జరిగిన విషయాన్ని బాలిక కుటుంబ సభ్యులకు తెలిపింది. తమ కూతురును పెళ్లి పేరుతో వంచించాడంటూ అదేరోజు రమేశ్‌ కుటుంబ సభ్యులకు చెప్పేందుకు వెళ్లిన బాలిక తల్లిపై రమేశ్‌ తల్లి ఏసమ్మ, మేనత్త ఫాతిమా, మేనమామ షేక్‌ ఖాదర్‌బాషా దాడికి పాల్పడ్డారు. దీంతో మంగళవారం రాత్రి బాలిక తల్లి హైదరాబాద్ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read:

Income Tax Returns: పన్ను చెల్లింపుదారులకు కేంద్రం ఊరట.. ఐటీ రిటర్నుల దాఖలుకు గడువు పొడిగింపు

కోవిడ్ సంక్షోభంలో తలిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్యాసౌకర్యం కల్పించాలి, ప్రధానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లేఖ

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం