Hyderabad: పుట్టినరోజే ఆఖరి రోజైంది.. రైలు ప్రమాద ఘటనలో మహిళ దుర్మరణం

పుట్టినరోజే ఆమెకు చివరి రోజైంది. కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపిన ఆమె కానరాని లోకాలకు వెళ్లిపోయింది. ఎన్నో బాధలు భరించి కుటుంబాన్ని పోషిస్తున్న ఆమెపై విధి కన్నెర్ర చేసింది. ఆఫీస్ కు బయల్దేరిన మహిళ అనూహ్యంగా...

Hyderabad: పుట్టినరోజే ఆఖరి రోజైంది.. రైలు ప్రమాద ఘటనలో మహిళ దుర్మరణం
Khairatabad
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 19, 2022 | 7:30 AM

పుట్టినరోజే ఆమెకు చివరి రోజైంది. కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపిన ఆమె కానరాని లోకాలకు వెళ్లిపోయింది. ఎన్నో బాధలు భరించి కుటుంబాన్ని పోషిస్తున్న ఆమెపై విధి కన్నెర్ర చేసింది. ఆఫీస్ కు బయల్దేరిన మహిళ అనూహ్యంగా జరిగిన రైలు ప్రమాద ఘటనలో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. మహారాష్ట్ర షోలాపూర్ ప్రాంతానికి చెందిన లావణ్య. తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ లోని ఖైరతాబాద్ తుమ్మలబస్తీలో నివాసముంటోంది. లావణ్య స్వస్థలం మహారాష్ట్రలోని షోలాపూర్ కాగా అదే ప్రాంతానికి చెందిన గణేశ్ అనే వ్యక్తితో ఆమెకు వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. భర్త ప్రవర్తన భరించలేక లావణ్య విడాకులు కోరుతూ షోలాపూర్‌ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులు, కుమార్తెలతో కలిసి హైదరాబాద్ కు వలస వచ్చింది. తండ్రి రమేశ్ ఓ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా, లావణ్య టెలీ కాలర్‌గా పని చేస్తోంది. బుధవారం లావణ్య పుట్టినరోజు సందర్భగా ఇంట్లో అందరికీ ఇష్టమైన పులిహోర చేసి వడ్డించి, తానూ టిఫిన్‌ కట్టుకుని ఆఫీస్ కు బయల్దేరింది.

ఖైరతాబాద్‌ వద్ద రైలు పట్టాలు దాటుతున్న సమయంలో ఓ ఎక్స్‌ప్రెస్‌ రైలు వస్తోంది. ఆ రైలు వెళ్లిన తర్వాత పట్టాలు దాటొచ్చని పట్టాలకు ఇటువైపున పక్కనే నిల్చుంది. అదే సమయంలో ఇటువైపు ట్రాక్‌పై ఎంఎంటీఎస్‌ రైలు దూసుకొచ్చింది. రైలు ఆమె తలను ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. ప్రయాణికులు, రైల్వే సిబ్బంది అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వారు వచ్చే సరికే ఆమె మృతి చెందిందని రైల్వే పోలీసులు ధ్రువీకరించారు.

మృతురాలి వివరాలు మొదట తెలియకపోవడంతో గుర్తుతెలియని మహిళ మృతిగా రైల్వే పోలీసులు భావించారు. సాయంత్రానికి ఆమె స్నేహితుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ఫోన్‌ చేయడంతో వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

Money Donate: నిజమైన శ్రీమంతుడు.. యావదాస్తిని దానం చేసిన బిజినెస్‌మెన్.. భార్య, కొడుకుతో కలిసి..

RRR Movie: 100 థియేటర్లలో మళ్లీ విడుదలవుతోన్న ఆర్.ఆర్.ఆర్ సినిమా.. అందుబాటులోకి అన్‌కట్‌ వెర్షన్‌.. అయితే..

CM Jagan: మెగా పవర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌.. ప్రపంచంలోనే తొలిసారిగా..