AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: 100 థియేటర్లలో మళ్లీ విడుదలవుతోన్న ఆర్.ఆర్.ఆర్ సినిమా.. అందుబాటులోకి అన్‌కట్‌ వెర్షన్‌.. అయితే..

RRR Movie: భారతీయ సినిమా ఇండస్ట్రీలో బాహుబలి (Bahubali)తో పెను సంచలనం సృష్టించిన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆర్‌.ఆర్‌.ఆర్‌ (RRR) ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్‌ (NTR), రామ్‌ చరణ్‌ (Ram Charan)లు హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా..

RRR Movie: 100 థియేటర్లలో మళ్లీ విడుదలవుతోన్న ఆర్.ఆర్.ఆర్ సినిమా.. అందుబాటులోకి అన్‌కట్‌ వెర్షన్‌.. అయితే..
Narender Vaitla
|

Updated on: May 19, 2022 | 6:34 AM

Share

RRR Movie: భారతీయ సినిమా ఇండస్ట్రీలో బాహుబలి (Bahubali)తో పెను సంచలనం సృష్టించిన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆర్‌.ఆర్‌.ఆర్‌ (RRR) ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్‌ (NTR), రామ్‌ చరణ్‌ (Ram Charan)లు హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్‌ బాక్సాఫీస్‌ ముందు వసూళ్ల సునామి సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 1100 కోట్లకుపై కలెక్షన్లు రాబట్టింది. ఇద్దరు స్టార్‌ హీరోల క్రేజ్‌, జక్కన్న దర్శకత్వ ప్రతిభ వెరసి సినిమాను విజయ తీరాలకు చేర్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగా శుక్రవారం విడుదలవుతోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే జూన్‌ 1న ట్రిపులార్‌ సినిమాను మరోసారి థియేటర్లలో విడుదల చేయనున్నారు.

అయితే ఇది ఇండియాలో కాదులేండి అమెరికాలో. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సినిమాను కేవలం ఒకరోజు మాత్రమే ప్రదర్శించనున్నారు. స్పెషల్‌ స్క్రీనింగ్ పేరుతో సినిమాలో కొన్ని సన్నివేశాలను తొలగించారు. అయితే ఇప్పుడు మళ్లీ విడుదల చేస్తున్న షోలో సన్నివేశాలను యథాతథంగా ఉంచి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ అన్‌కట్‌ వెర్షన్‌ సినిమాను చూడటం కోసం టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. సినిమా విడుదలై ఇన్ని రోజులు అవుతోన్నా ఇప్పటికీ టికెట్లు హాట్‌ కేక్‌లా అమ్ముడుపోవడం విశేషం.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే శుక్రవారం నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. అయితే సినిమా చూడాలంటే రెగ్యులర్‌ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఎర్లీ యాక్సెస్‌ పేరుతో అదనంగా రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. దీని వ్యాలిడిటీ ఏడు రోజులు మాత్రమే ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్