Crime News: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఎంఎం పడిలో భార్యాభర్తల మధ్య చోటుచేసుకున్న వివాదం.. భార్య ప్రాణాలు తీసింది. పైగా తల్లిని కాపాడుకునేందుకు పిల్లలు ప్రయత్నించగా.. ఆ కసాయి భర్త అడ్డుకుని మరీ ప్రాణాలు తీశాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మొహమ్మద్ సాజిద్, సబీనా బేగం దంపతులు. వీరికి ఐదుగురు ఆడ పిల్లలు ఉన్నారు. వీరి మధ్య నిత్యం ఘర్షణలు చోటు చేసుకుండేవి. టెంట్ హౌస్‌లో కూలి పని చేస్తున్న సాజిద్.. రోజూ సాయంత్రం అవగానే మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు. అలా మద్యం మత్తులో భార్యను చితకబాదేవాడు. తన పిల్లలు అడ్డుకుంటే.. వారిపై కూడా దాడి చేసేవాడు. అయితే, రోజూలాగే బుధవారం నాడు సాయంత్రం కూడా సాజిద్ ఫుల్లుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. పిల్లలను, భార్యను చితకబాదాడు.
సాజిద్ వేధింపులు తాళలేక.. తాను పురుగుల మందు తాగి చనిపోతానంటూ సబీనా చెప్పింది. వెంటనే అందుబాటులో ఉన్న ఎలుకల మందు తాగింది. అయితే, అది గమనించిన వారి పిల్లలు.. అమ్మ చనిపోతుందని, పక్కింటి వాళ్లను పిలుస్తామంటూ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ ఆ కసాయి భర్త సాజిద్.. ఆ పిల్లలను అడ్డుకుని గదిలో వేసి బంధించాడు. అయితే, ఉదయం ఎంతకీ సబీనా బయటకు రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే ఇంటికి వెళ్లి చూడగా.. సబీనా చనిపోయి ఉంది. విషయాన్ని రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సబీనా మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల వల్లే సబీనా ఆత్మహత్య చేసుకుందని కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. సబీనా ఆత్మహత్యకు కారణమైన సాజిద్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Also read:
Raj Tarun’s Anubhavinchu Raja: రామ్ చరణ్ వదిలిన రాజ్ తరుణ్ టీజర్.. ఆకట్టుకుంటున్న అనుభవించు రాజా…