AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: డబ్బుందని ఏమైనా చేస్తారా? సెల్ఫీ వీడియో తీసుకుంటూ కానిస్టేబుల్‌ భార్య లైవ్‌లోనే..

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో పోలీసు అధికారి భార్య భర్త, బావల వేధింపులతో ఆత్మహత్య చేసుకుంది. లైవ్ సెల్ఫీ వీడియోలో తన బాధను వెల్లడించింది. భర్తకు మరో వివాహం చేయాలనే కోరిక ఉందని, డబ్బున్న వారు తమను హింసించారని ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Video: డబ్బుందని ఏమైనా చేస్తారా? సెల్ఫీ వీడియో తీసుకుంటూ కానిస్టేబుల్‌ భార్య లైవ్‌లోనే..
Up Women
SN Pasha
|

Updated on: Jul 28, 2025 | 2:51 PM

Share

ఒక వైపు భార్యలో చేతిలో భర్తలు హత్యకు గురవుతున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో పెరుగుతుంటే.. మరోవైపు భార్యలపై భర్తల వేధింపులు కూడా అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. తాజా భర్త వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. సెల్ఫీ వీడియో తీసుకుంటూ లైవ్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నివసిస్తున్న ఒక పోలీసు అధికారి భార్య తన భర్త వేధింపులతో బాధపడుతూ ఒక వీడియో ద్వారా తన బాధను వ్యక్తం చేసి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్‌ వీడియోలో తన భర్త తనను వేధిస్తున్నాడని, అలాగే తన భర్త బావ కూడా తన చావుకు కారణం అంటూ ఆరోపించింది. ఆ మహిళ తన బాధను వ్యక్తం చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది.

వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తన భర్త వేధింపుల కారణంగా సౌమ్య కశ్యప్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. ఆమెను కొట్టారని, మానసికంగా వేధించారని, భర్త అనురాగ్ సింగ్, తన బావ, బావ సోదరుడు తనను వేధిస్తున్నారని ఆ మహిళ ఆరోపించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కానిస్టేబుల్ అనురాగ్ సింగ్ తన భార్యతో కలిసి అద్దె ఇంట్లో నివసించాడు. కానిస్టేబుల్ అనురాగ్‌ను బికెటి పోలీస్ స్టేషన్‌లోని ఈగిల్ మొబైల్‌లో పోస్ట్ చేశారు.

నా భర్తకు మళ్ళీ వివాహం చేయాలనుకుంటున్నారు. నా భర్త బావ సంజయ్ పోలీస్‌ డిపార్ట​్‌మెంట్‌లో పనిచేస్తున్నాడు. అతని సోదరులలో ఒకరైన రంజిత్ న్యాయవాది. వీరి వద్ద డబ్బు ఉంది, డబ్బుతో వారు ఏదైనా చేయగలరు. వారు నన్ను ఎంతగానో హింసించారు. ఈ రోజు నేను చనిపోతున్నానంటే కారణం ఈ వ్యక్తులే. కేసు గురించిన సమాచారాన్ని మృతురాలి కుటుంబానికి అందించామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని క్రైమ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
US F1 వీసా స్లాట్‌ కోసం రూ.20 వేలు డిమాండ్.. ఇంటర్వ్యూ రద్దు
US F1 వీసా స్లాట్‌ కోసం రూ.20 వేలు డిమాండ్.. ఇంటర్వ్యూ రద్దు
వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోన్న 'అగ్గిపెట్టె మచ్చ'..ఏమైందంటే?
వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోన్న 'అగ్గిపెట్టె మచ్చ'..ఏమైందంటే?
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీబీఐ సోదాలు..!
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీబీఐ సోదాలు..!
గురు నక్షత్ర గోచారంతో వీరికి కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు
గురు నక్షత్ర గోచారంతో వీరికి కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు
టెర్మినేటర్ సీన్ రిపీట్! వేడి లావాలోకి దూకేసిన హ్యూమనాయిడ్ రోబోలు
టెర్మినేటర్ సీన్ రిపీట్! వేడి లావాలోకి దూకేసిన హ్యూమనాయిడ్ రోబోలు
ఆకాశవాణి భవన్‌ వద్ద హైటెన్షన్.. రాహుల్‌గాంధీ సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్..!
ఆకాశవాణి భవన్‌ వద్ద హైటెన్షన్.. రాహుల్‌గాంధీ సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్..!
బంగారం ధర 26% పతనం.. ఇదే కొనడానికి సరైన సమయమా? వేచి ఉండాలా?
బంగారం ధర 26% పతనం.. ఇదే కొనడానికి సరైన సమయమా? వేచి ఉండాలా?
అంతర్జాతీయ వేధింపుల గ్యాంగ్‌ వెనుక భారతీయుడు!
అంతర్జాతీయ వేధింపుల గ్యాంగ్‌ వెనుక భారతీయుడు!
‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్
‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్
హాయిగా నిద్రపోండి-లక్షల్లో గెలుచుకోండి! వినూత్న స్లీప్ కాంపిటీషన్
హాయిగా నిద్రపోండి-లక్షల్లో గెలుచుకోండి! వినూత్న స్లీప్ కాంపిటీషన్