Murder: దారుణం.. ఆ సంబంధానికి అడ్డొస్తున్నాడని.. ప్రియుడితో కలిసి ప్లాన్.. భర్తను కడతేర్చిన భార్య!

Husband Murder: అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో.. భార్య.. ప్రియుడితో కలిసి తన భర్తనే కడతేర్చింది. ఈ దారుణ సంఘటన ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలం

Murder: దారుణం.. ఆ సంబంధానికి అడ్డొస్తున్నాడని.. ప్రియుడితో కలిసి ప్లాన్.. భర్తను కడతేర్చిన భార్య!
Murder

Husband Murder: అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో.. భార్య.. ప్రియుడితో కలిసి తన భర్తనే కడతేర్చింది. ఈ దారుణ సంఘటన ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తనికెళ్ల గ్రామానికి చెందని భాస్కర్, జనార్దన్ స్నేహితులు. గత రెండేళ్లుగా భాస్కర్ భార్యతో జనార్దన్ అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసి భాస్కర్, జనార్ధన్ గొడవ జరిగింది. అనంతరం పెద్దల సమక్షంలో పంచాయితీలు నిర్వహించి జనార్దన్‌ను పలుమార్లు హెచ్చరించారు. అనంతరం కొన్ని రోజులపాటు భాస్కర్ భార్యకు దూరంగా ఉన్న.. జనార్థన్ మరలా ఆమెతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో భార్య, ప్రియుడు జనార్దన్ కలిసి ఉండటాన్ని భాస్కర్ చూశాడు. అనంతరం గంట తర్వాత భాస్కర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు.

అయితే.. పథకం ప్రకారం ప్రియుడితో కలిసి భార్యే హత్య చేయించిదని మృతుడి బంధువులు ఆరోపించారు. భాస్కర్ మృతికి కారకుడైన ప్రియుడు జనార్దన్ ఇంటిముందు మృతదేహంతో బంధువులు ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భాస్కర్ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు.

Also Read:

Gang rape: గుంటూరు జిల్లాలో దారుణం.. ప్రేమజంటపై దాడి.. ఆపై సామూహిక అత్యాచారం..

దారుణం.. తల్లి, తండ్రి, చెల్లి, నానమ్మను చంపిన యువకుడు.. కుటుంబ సభ్యులను చంపి మమ్మీలుగా మార్చే యత్నం