Gang rape: గుంటూరు జిల్లాలో దారుణం.. ప్రేమజంటపై దాడి.. ఆపై సామూహిక అత్యాచారం..
గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో దారుణం జరిగింది. సీతానగరం పుష్కర ఘాట్ల వద్ద నదీ తీరంలో సేదతీరుతున్న ప్రేమజంటపై దుండగులు దాడి చేసి ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో దారుణం జరిగింది. సీతానగరం పుష్కర ఘాట్ల వద్ద నదీ తీరంలో సేదతీరుతున్న ప్రేమజంటపై దుండగులు దాడి చేసి ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం ఈ దారుణం జరిగింది. తన కాళ్ళు, చేతులు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. అనంతరం నిందితులు పడవలో విజయవాడ వైపు వెళ్లిపోయారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలావుంటే.. బాధితురాలిని వైద్య పరీక్షలు నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఇప్పటికే కొంతమంది స్థానిక యువకులను జరిగిన ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
జరిగిన ఘటనపై బాధితురాలి బంధువులు అందించిన కథనం ప్రకారం… బాధితురాలు కాబోయే భర్తతో కలిసి కృష్ణ నదిలోని పుష్కర ఘాట్ వద్దకు వెళ్లిందని వెల్లడించారు. బ్లేడ్ బ్యాచ్‌లోని ముగ్గురు ఆ ఇద్దరిపై దాడి చేసి సామూహిక అత్యాచారం చేశారని ఆరోపించారు. వాళ్లిద్దరి కాళ్లు, చేతులు కట్టేశారని, బాధితురాలు ఫోన్ చేసి చెప్పడంతోనే తాము నది దగ్గరకు వెళ్లామని తెలిపారు.
పోలీసులు నదిలో మూడు గంటల సేపు నిందితుల కోసం గాలించారని తెలిపారు. నిందితులను పట్టుకునే పని ఉన్నారు.. ఇందులో భాగంగా ఒకరి ఫోటో సేకరించారని తెలుస్తోంది. ప్రస్తుతానికి బాధితురాలు మాట్లాడలేని స్థితిలో ఉందని పోలీసులు తెలిపారు. ఘటన ప్రదేశంలో పోలీసులు సీన్ రీకన్స్డ్రక్షన్ చేస్తున్నారు. పోలీసుల అదుపులో బాధితురాలి ప్రేమికుడు, కాబోయే భర్త విచారిస్తున్నారు.
అయితే ప్రాథమిక అంచనాకు పోలీసులు వచ్చారు. ఈ దురాఘతానికి పాల్పడింది గంజాయి, బ్లేడ్ బ్యాచ్ అని పోలీసులు అంచనాకు వచ్చారు. వారిలో ఒకరిని గుర్తించినట్లుగా సమాచారం. ఈ ఘటన శనావారం రాత్రి 10 గంటల సమయంలో జరిగినట్లుగా పోలీసులు తెలిపారు.