Road Accident: బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. చెరువులో పడ్డ వలస కూలీల బస్సు.. ఏడుగురు మృతి, మరికొందరు సీరియస్

|

Sep 23, 2021 | 12:01 PM

పశ్చిమబెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తర దినాజ్‌పుర్‌లో ఓ బస్సు చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు కూలీలు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. జార్ఖండ్‌ నుంచి లక్నోకు వలస కూలీలతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది.

Road Accident: బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. చెరువులో పడ్డ వలస కూలీల బస్సు.. ఏడుగురు మృతి, మరికొందరు సీరియస్
Bus Accident
Follow us on

West Bengal bus accident: పశ్చిమబెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తర దినాజ్‌పుర్‌లో ఓ బస్సు చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు కూలీలు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. జార్ఖండ్‌ నుంచి లక్నోకు వలస కూలీలతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటీన ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు.

జార్ఖండ్‌ నుంచి లక్నో వెళ్తున్న బస్సు బుధవారం రాత్రి 10.45 గంటల సమయంలో పశ్చిమబెంగాల్‌లోని రాయిగంజ్‌ వద్ద 34వ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టింది. అప్పటికీ ఆగని బస్సు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో అందులోని ప్రయాణికులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. మరికొందరు తీవ్ర గాయాలతో బయటపడ్డారన్నారు.

కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. నయాంజులిలో బురదలో మునిగిపోయిన బస్సును పోలీసులు, అగ్నిమాపక దళం, విపత్తు నిర్వహణ సిబ్బంది క్రేన్ సహాయంతో బయటకు తీశారు. మృతదేహాలను అంబులెన్స్ ద్వారా రాయగంజ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.

కాగా, ఈ ఘటనలో బస్సు డ్రైవర్, కండక్టర్, మరికొందరు ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే, వీరంతా జార్ఖండ్‌లోని పాకూర్ జిల్లా నుండి పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా మరియు ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా వరకు వివిధ ప్రాంతాలకు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. ప్రమాదానికి ఒక గంట ముందు, బస్సు భోజనానికి ఒక దాబా వద్ద ఆగింది. డ్రైవర్ అక్కడ మద్యం తాగి నడపడం వల్లే ప్రమాదానికి కారణమని బాధితులు ఆరోపించారు. ప్రమాదం జరిగిన సమయంలో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు అంచనా వేశారు. వారిలో అనేక మంది మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని అధికారులు భావిస్తున్నారు.

Read Also…  Andhra Pradesh: అలా చేయడం సరికాదు.. ప్రివిలేజ్ కమిటీ చైర్మన్‌కు లేఖ రాసిన టీడీపీ ఎమ్మెల్యే అనగాని..

కొమురంభీం జిల్లాలో పెద్దపులి సంచారం మరోసారి కలకలం.. పాదముద్రల ఆధారంగా అటవీ అధికారులు గాలింపు!