Andhra Pradesh: అలా చేయడం సరికాదు.. ప్రివిలేజ్ కమిటీ చైర్మన్‌కు లేఖ రాసిన టీడీపీ ఎమ్మెల్యే అనగాని..

Andhra Pradesh: శాసనసభలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం ప్రతిపక్షం బాధ్యత అని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు.

Andhra Pradesh: అలా చేయడం సరికాదు.. ప్రివిలేజ్ కమిటీ చైర్మన్‌కు లేఖ రాసిన టీడీపీ ఎమ్మెల్యే అనగాని..
Anagani Satya Prasad
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 23, 2021 | 11:32 AM

Andhra Pradesh: శాసనసభలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం ప్రతిపక్షం బాధ్యత అని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. ప్రభుత్వం ప్రశ్నిస్తే చర్యలు తీసుకుంటామనడం సరికాదని అన్నారు. ఈ మేరకు గురువారం నాడు ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్‌కి, అసెంబ్లీ కార్యదర్శికి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ రాశారు. ప్రజా సమస్యలకు పరిష్కారం కనుగొనే వేదికపై ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనసభ ఉపపక్ష నేతలు కింజారపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులకు మాట్లాడే అవకాశం లేకుండా చేయడమనేది సరైన విధానం కాదన్నారు. సభ్యుల వివరణ కూడా తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.

‘‘ప్రజాహితం కోరేవారైవనా ప్రజల తరఫున ప్రతిపక్షం నుంచి సూచనలు, సలహాలు కోరుకుంటారు, కానీ ప్రతిపక్షం ప్రజా సమస్యలపై, ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించడమే నేరంగా, ప్రజలపక్షాన మాట్లాడడం ఘోరంగా భావిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలను శత్రువులుగా చూసే విధానం ఏమాత్రం సమర్థనీయం కాదు. చట్ట సభల్లో మాట్లాడే అవకాశం లేకుండా చేయడమంటే రాజ్యాంగం కల్పించిన వాక్‌స్వాతంత్య్రం హక్కును నిర్వీర్యం చేయడమే. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఆ పార్టీ నేతలు అసెంబ్లీలో వ్యవహరించిన తీరు మర్చిపోయారా? మీరు స్పీకర్‌ పోడియం ఎక్కి ఆందోళనలు చేయలేదా? ప్రజాస్వామ్య దేవాలయాలుగా చెప్పుకునే చట్టసభల్లో ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడాలని, శాసనసభాపక్ష ఉప నేతలకు మాట్లాడే అవకాశం లేకుండా తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించుకోవాలని కోరుతున్నాం.’’ అంటూ ఎమ్మెల్యే అనగాని సత్యప్రాసద్ తన లేఖలో పేర్కొన్నారు.

Also read:

Ganesh Immersion: ఆ ఊర్లో తాబేళ్లపై ఊరేగుతున్న బొజ్జ గణపయ్య.. చూడముచ్చటైన వీడియో మీకోసం..

Airports: వేల కోట్ల నష్టాలతో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ తెరపైకి తెచ్చిన ఫార్ములా.. కేంద్రం దారెటు.?

Crime News: పురుగుల మందు తాగిన భార్య.. కాపాడబోయిన పిల్లలను బంధించిన భర్త.. చివరికి ఏం జరిగిందంటే..