బెంగళూరులో పార్టీకి వెళ్లి వస్తున్న యువతిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడి.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు!

కామంతో కళ్లు మూసుకుపోయిన దుండగులు అఘాయితాలకు ఒడిగడుతూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా నిత్యం ఏదోక మూలా మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం ఎంత నిఘా పెట్టినా, కఠిన శిక్షలు అమలు చేస్తున్నా, సమాజంలో కీచకులకు కనువిప్పు కలగడంలేదు.

బెంగళూరులో పార్టీకి వెళ్లి వస్తున్న యువతిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడి.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు!
Rape Arrest
Follow us
Balaraju Goud

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 23, 2021 | 2:50 PM

Cab driver rapes woman: కామంతో కళ్లు మూసుకుపోయిన దుండగులు అఘాయితాలకు ఒడిగడుతూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా నిత్యం ఏదోక మూలా మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం ఎంత నిఘా పెట్టినా, కఠిన శిక్షలు అమలు చేస్తున్నా, సమాజంలో కీచకులకు కనువిప్పు కలగడంలేదు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. స్నేహితుడితో కలిసి పార్టీ చేసుకొని ఇంటికి తిరిగి వస్తున్న మహిళపై ఉబెర్ డ్రైవరు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవన్ బీమానగర్ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా నివాసముంటోంది. మహిళ తన స్నేహితుడి వద్ద పార్టీ చేసుకొని హెచ్‌ఎస్ఆర్ లేఅవుట్ ప్రాంతం నుంచి మురుగేశ్ పాళ్యానికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్ గమ్యస్థానానికి చేరుకోగానే ఉబెర్ డ్రైవరు కారు లాక్ చేసి, మహిళపై అత్యాచారం చేశాడు. అనంతరం మహిళను కారులో నుంచి బయటకు నెట్టాడు.

అయితే బాధిత మహిళ అరుపులు విన్న క్యాబ్ డ్రైవరు అక్కడినుంచి పారిపోయాడు. అనంతరం బాధిత మహిళ అత్యాచార ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడి నుంచి లాక్కున్న సెల్‌ఫోన్‌ను పోలీసులకు ఇచ్చింది బాధితురాలు. నిందితుడైన ఉబెర్ క్యాబ్ డ్రైవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడని, అతన్ని ప్రశ్నిస్తున్నామని బెంగళూరు అదనపు పోలీసు కమిషనర్ మురుగన్ చెప్పారు. విచారణ ప్రారంభ దశలో ఉన్నందున డ్రైవరు పేరును దాచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు. బాధిత మహిళను వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి పంపించారు. కర్ణాటక రాష్ట్రంలో బసవరాజ్ బొమ్మై సీఎం అయ్యాక మైసూరులో సామూహిత అత్యాచారం ఘటన జరిగింది. ఇది రెండో ఘటన కావడంతో ప్రతిపక్షాలు సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఇదిలావుంటే, అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే, మహిళపై అత్యాచారం చేసినటువంటి ఆరోపణలను క్యాబ్ డ్రైవర్ ఖండించాడు. క్యాబ్ చార్జీ చెల్లింపు విషయంలో ఇద్దరు మధ్య గొడవ జరిగిందని, తాను మహిళా ప్రయాణికురాలిని తాకలేదని చెప్పారు. ఈ పెనుగులాటలో సెల్‌ఫోన్ లాక్కున్న మహిళ పోలీసులకు తప్పడు ఫిర్యాదు చేసిందన్నారు.

Read Also…  Road Accident: బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. చెరువులో పడ్డ వలస కూలీల బస్సు.. ఏడుగురు మృతి, మరికొందరు సీరియస్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..