మున్సిపల్ ఆఫీసులో ముదిరిన వివాదం..కౌన్సిలర్ల భర్తల వాగ్వాదం
నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో కౌన్సిలర్ల భర్తలు వాగ్వాదానికి దిగారు..ఓ నిర్మాణం విషయంలో ఇద్దరు కౌన్సిలర్ల భర్తల మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో ఇద్దరూ పరస్పరం మాటల తూటాలు పేల్చుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో కౌన్సిలర్ల భర్తలు వాగ్వాదానికి దిగారు..ఓ నిర్మాణం విషయంలో ఇద్దరు కౌన్సిలర్ల భర్తల మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో ఇద్దరూ పరస్పరం మాటల తూటాలు పేల్చుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం జరిగిన ఎస్సీ, ఎస్టీ బడ్జెట్ ప్లాన్, పట్టణంలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై చర్చించేందుకు సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ఐదో వార్డు కౌన్సిలర్ కు బదులు ఆమె భర్త, టీఆర్‌ఎస్ పట్టణా అధ్యక్షుడు, ఆరో వార్డు కౌన్సిలర్ భర్త, కాంగ్రెస్ నేత అయిన అమానుల్లాఖాన్ హాజరయ్యారు. పట్టణంలోని టవర్స్ కాలనీలో జరుగుతున్న ఓ నిర్మాణం విషయమై ఇద్దరు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే అమానుల్లాఖాన్ ఆగ్రహంతో కమిషనర్ గదిలో ఉన్న టేబుల్‌ను నెట్టి వేయడంతో అద్దాలు పగిలిపోయి ఫర్నీచర్ ధ్వంసమైంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కమిషనర్ తెలిపారు. మహిళా ప్రజాప్రతినిధుల భర్తలు అధికారిక సమావేశాలకు హాజరుకావొద్దని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ వీరిద్దరు వచ్చి గొడవకు దిగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇద్దరిపై కూడా చర్యలు తీసుకోవాలని పలువురు స్థానికులు కమిషనర్‌ను కోరుతున్నారు.