విజయవాడ రాహుల్ హత్య కేసులో దర్యాప్తు వేగవంతమైంది. పోలీసుల విచారణలో కీలక అంశాలు బయటపడుతున్నాయి. రాహుల్ మర్డర్‌కి మూడు నెలల ముందే ప్లాన్ చేసినట్లు తేలింది. ప్రధాన సూత్రధారి విజయ్‌తో పాటు మరికొందరి ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించారు. నిందితుల కోసం టాస్క్‌ఫోర్స్ బృందాలు గాలిస్తున్నాయి. పోస్టుమార్టం రిపోర్ట్, కాల్‌డేటా, క్లూస్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. రెండేళ్ల కిందట మాజీమంత్రి మాణిక్యాలరావు వియ్యంకుండి కుమార్తె డాక్టర్ శిరీషతో రాహుల్‌కు పెళ్లి అయింది.
విజయవాడలో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి కట్టాలని భార్యభర్తలు ప్లాన్ వేశారు. ఇంతలో మర్డర్ జరగడంతో ఇప్పుడు ఫ్యామిలీ విషాదం నెలకొంది. శిరీషది తాడేపల్లిగూడెం. రాహుల్ ది ఒంగోలు. వీరు ఇద్దరు విజయవాడలో స్థిరపడ్డారు. రాహుల్‌కి ఎవరితో విభేదాలు లేవని అంటున్నారు భార్య శిరీష. రాహుల్‌కు ఎవరితో గొడవపడే మనస్త్వతం కూడా లేదని చెబుతున్నారు.
విజయవాడ జీజీహెచ్ లో రాహుల్ మృతదేహానికి పోస్టుమార్టం జరుగింది. కుటుంబ సభ్యులు, బంధువులు పెద్దఎత్తున జీజీహెచ్ దగ్గరకు చేరుకున్నారు. పోస్టుమార్గం తర్వాత డెడ్ బాడీని ఒంగోలుకి తరలించనున్నారు. రాహుల్ హత్యను అతని కుటుంబ సభ్యులు జీర్జించుకోలేకపోతున్నారు. ఎంతోమందికి ఉపాధి కల్పించి… పది మందికీ ఉపయోగపడుతోన్న రాహుల్ ను కిరాతంగా చంపడం దారుణమంటున్నారు రాహుల్ మామయ్య.
రాహుల్ కెనడలో MS చేశాడు. ఆ తర్వాత ఏపీకి వచ్చి బిజినెస్ ప్లాన్ స్టార్ట్ చేశాడు. అందులో నుంచి పుట్టింది.. జిక్సిన్ సిలిండర్స్ ప్రైవేట్ లిమిటెడ్. 2015లో స్టార్ట్ చేశాడు. ఇక 2017లో జిక్సిన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మొదలు పెట్టాడు. 2018లో జిక్సిన్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్.. నెక్ట్స్ 2019లో జిక్సిన్ పేపర్స్ ప్రేవేట్ లిమిటెడ్ స్టార్ట్ చేశాడు. 2020లో జిక్సిన్ వెస్సల్స్ పేరుతో ఓ కంపెనీని పెట్టిన రాహుల్.. ఈ మధ్యే ఒంగోల్లోనూ ఇంకో కంపెనీకి శంకుస్థాపన చేశారు.
ఇవి కూడా చదవండి: Sharia Law: షరియా చట్టం అంటే ఏంటి? తాలిబన్లు అమలు చేసే ఈ చట్టంలో శిక్షలు ఎలా ఉంటాయో తెలుసా?
Afghanistan crisis: ఆ విమానంలో నుంచి కింద పడిన ముగ్గురిలో ఇద్దరు అన్నదమ్ములు!