ఆకతాయిలకు తగిన గుణపాఠం… తుపాకి తూటా గురి…వీడియో పోలీసులకు చేరి…. కేసుల పాలైరీ…

ఆకతాయిగా చేసిన పని వారికి గుణపాఠం నేర్పింది.. కటకటాలపాలయ్యేలా చేసింది. సరదా కోసం తూటా పేలిస్తే శబ్ధం పోలీసులకు చేరి బుల్లెట్ కేసు రూపంలో రీసౌండ్ ఇచ్చింది.

ఆకతాయిలకు తగిన గుణపాఠం... తుపాకి తూటా గురి...వీడియో పోలీసులకు చేరి.... కేసుల పాలైరీ...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 14, 2020 | 1:17 PM

ఆకతాయిగా చేసిన పని వారికి గుణపాఠం నేర్పింది.. కటకటాలపాలయ్యేలా చేసింది. సరదా కోసం తూటా పేలిస్తే శబ్ధం పోలీసులకు చేరి బుల్లెట్ కేసు రూపంలో రీసౌండ్ ఇచ్చింది. మొత్తంగా సరదాగా చేసిన పని వారిని కేసుల పాలు చేసింది.

ఉత్తర్ ప్రదేశ్‌లో….

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్ ప్రాంతంలో కొందరు ఆకతాయిలు తుపాకితో గాల్లోకి కాల్పులు జరిపారు. చేస్తున్న పనిని వీడియో తీసుకున్నారు. మిత్రులకు షేర్ చేసుకున్నారు. అది కాస్తా వైరల్ గా మారింది. పోలీసులకు చేరింది. దీంతో గాల్లోకి కాల్పులు జరిపిన వారిపై కేసులు నమోదు చేసినట్లు స్థానిక ఎస్పీ మిశ్రా తెలిపారు. కాగా, వైరల్ అయిన వీడయో తాజాది కాదని, గతంలోదని ఆయన తెలిపారు. సదరు యువకులను గుర్తించామని, కేసు నమోదు చేశామని మిశ్రా తెలిపారు. విచారణ అనంతరం ఆ తుపాకి కలిగిన వ్యక్తి అనుమతిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఇదే తరహా ఘటన మరొకటి మీరట్‌లో చోటు చేసుకుంది. ఒక కుటుంబం వారు నిర్వహించుకుంటున్న వేడుకలో తుపాకితో గాల్లోకి కాల్పులు జరిపినట్లు, వారిపై కేసు నమోదు చేసినట్లు మీరట్ సీఐ అరవింద్ తెలిపారు.