కల్నల్‌పై కేసు… భార్యాభర్తల్ని ఇంటికి పిలిచి… ఆపై భర్తకు మత్తు మందిచ్చి… భార్యపై అఘాయిత్యం…
భారత సైనిక విభాగంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న ఓ పోలీసు నీచమైన పనికి తెగబడ్డాడు. మంచి మనిషిలా నటించి మృగంలా మారాడు.
భారత సైనిక విభాగంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న ఓ పోలీసు నీచమైన పనికి తెగబడ్డాడు. మంచి మనిషిలా నటించి మృగంలా మారాడు. మర్యాదపూర్వకంగా ఇంటికి పలిచి సభ్య సమాజం తలదించుకునే పనికి పాల్పడ్డాడు. రక్షించాల్సిన వాడే భక్షకుడయ్యాడు.
ఇంటికి పిలిచి… ఘాతుకానికి తెగించి….
ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్ సెంట్రల్ ఆర్డినెన్స్‌లో నీరజ్ గెహ్లెట్ కల్నల్‌గా పని చేస్తున్నాడు. ఇంటి పక్కనే ఉండే భార్యాభర్తల్ని తన ఇంటికి భోజనానికి పిలిచాడు. అనంతరం భర్తకు మత్తు మందిచ్చి… అతడి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బాధితురాలి భర్త ఫిర్యాదు చేయడంతో నీరజ్ పై కేసు నమోదు చేసినట్లు కాన్పూర్ సిటీ ఎస్పీ రాజ్‌కుమార్ అగర్వాల్ తెలిపారు.