రైతులను ఉగ్రవాదులతో పోల్చే వారు మనుషులే కాదు.. బీజేపీ నేతలపై భగ్గుమన్న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే..
బీజేపీ నేతలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఫైర్ అయ్యారు. రైతులపై ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు.
బీజేపీ నేతలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఫైర్ అయ్యారు. రైతులపై ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. రైతు ఉద్యమాన్ని ఉగ్రవాదంతో పోల్చే వారెవరూ మనుషులే కాదంటూ ధ్వజమెత్తారు. ముంబైలో మీడియాతో మాట్లాడిన సీఎం ఉద్ధవ్.. మహారాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడస్తోందంటూ మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘మహారాష్ట్రలో ఎమెర్జెన్సీ నడుస్తోంది ఓకే.. మరి ఢిల్లీలో ఏం జరుగుతోంది? మీరేమో అన్నదాతలను టెర్రరిస్టులు అని సంబోధిస్తారు. ఇదేనా మీ పద్ధతి’ అంటూ బీజేపీ నేతల తీరును ఉద్ధవ్ తూర్పారబట్టారు. అన్నదాలను టెర్రరిస్టులతో పోల్చడం ఏంటని నిలదీశారు. రైతులను టెర్రరిస్టులతో పోల్చేవారు అసలు మనుషులే కాదని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 20 రోజులు రైతులు దేశ రాజధాని వేదికగా ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తన డిమాండ్లను పట్టించుకోకపోవడంతో నేడు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిరశన దీక్ష చేపడతామని రైతు సంఘాల నాయకులు ప్రకటించారు. ఆ దిశగా దీక్ష కూడా చేపట్టారు.
Also Read: