భలే గిరాకీ: బేకరీ యజమాని వినూత్న ఆలోచన.. బిస్కెట్ కప్‌లో టీ .. క్యూ కడుతున్న జనాలు
ఓ బేకరీ వద్ద జనాలు భారీగా క్యూ కడుతున్నారు. అక్కడ టీ తాగేందుకు భారీగా జనాలు తరలివస్తున్నారు. అయితే ఛాయ్ కన్నా కప్పునే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్లోని ఓ బేకరీ వద్ద జనాలు భారీగా క్యూ కడుతున్నారు. అక్కడ టీ తాగేందుకు భారీగా జనాలు తరలివస్తున్నారు. అయితే ఛాయ్ కన్నా కప్పునే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. టీ తాగగానే కప్పుడు పడేయకుండా ఇష్టంగా తినేస్తున్నారు. అయితే టీ తాగిన తర్వాత కప్ తినడం ఏమిటనే గా మీ డౌట్.. ఏఆర్ మీనన్ రోడ్డులో ఓ బేకరీ యజమాని వినూత్నంగా ఆలోచించాడు. బిస్కెట్లతో తయారు చేయించిన ప్రత్యేకమైన కప్పుల్లో టీ విక్రయిస్తున్నాడు. ఈ అరుదైన టీ కప్పులకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీ ఎంత వేడిగా ఉన్నా ఈ కప్ 20 నిమిషాల వరకు మెత్తబడకుండా ఉండటం గమనార్హం. ఈ ప్రత్యేక టీ ధర 20 రూపాయలే.
వినూత్నంగా ఆలోచనతో తయారు చేసిన ఈ టీ కప్పునకు మంచి ఆదరణ లభిస్తుంది. దీంతో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వినియోగించి పడేసే కప్పులకన్నా ఇలా బిస్కెట్లతో తయారు చేసిన కప్పు ఎంతో వినియోగమని అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ బిస్కెట్ కప్పులు హైదరాబాద్ లోనే తయారు కావడం విశేషం. రానున్న రోజుల్లో వెనీలా, చాక్లెట్ తదితర రుచుల్లో కప్పులుత యారు చేసేందుకు సంబంధిత సంస్థ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.