AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రాహ్మణులను కులం పేరుతో పిలిస్తే ఏమీ అనుకోరు, శూద్రులను శూద్రులంటే ఫీలవుతారు – బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

శూద్రులను వారి వర్ణంతో పిలిస్తే ఫీలవుతారట... వారికి వర్ణం అర్థం కాదు కాబట్టే అలా తప్పుగా భావిస్తారట! ఈ మాటలన్నది భోపాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆమెకు కొత్తేమీ కాకపోయినా ఇవి మాత్రం ఘాటైన మాటలే!

బ్రాహ్మణులను కులం పేరుతో పిలిస్తే ఏమీ అనుకోరు,  శూద్రులను శూద్రులంటే ఫీలవుతారు - బీజేపీ ఎంపీ  ప్రజ్ఞా ఠాకూర్‌  వివాదాస్పద వ్యాఖ్యలు
Balu
|

Updated on: Dec 14, 2020 | 12:40 PM

Share

శూద్రులను వారి వర్ణంతో పిలిస్తే ఫీలవుతారట… వారికి వర్ణం అర్థం కాదు కాబట్టే అలా తప్పుగా భావిస్తారట! ఈ మాటలన్నది భోపాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆమెకు కొత్తేమీ కాకపోయినా ఇవి మాత్రం ఘాటైన మాటలే! మతపరమైన గ్రంథాలు, ధర్మశాస్త్రాల గురించి మాట్లాడుతూ ఆమె పలు విషయాలను చెప్పుకొచ్చారు. శూద్రులలో అవగాహనలోపం ఉందని ఆమె సూత్రీకరించారు. క్షత్రియులను క్షత్రియులని పిలిస్తే వారేమీ అనుకోరని, అలాగే బ్రాహ్మణులను కులం పేరుతో పిలిస్తే తప్పుగా అనుకోరని, వైశ్యులను వైశ్యులంటే ఏమీ అనుకోరని, శూద్రులను మాత్రం శూద్రులంటే తెగ ఫీలవుతారని ప్రజ్ఞా ఠాకూర్‌ అన్నారు. అందుకు కారణం వారి అవగాహనలోపమని తెలిపారు. అంతేనా.. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కూడా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై బెంగాల్‌లో జరిగిన దాడి పట్ల మమతా సరిగ్గా స్పందించలేదన్నారు.. బహుశా ఆమెకు పిచ్చిపట్టిందేమోనని ప్రజ్ఞాఠాకూర్‌ వ్యాఖ్యానించారు. ఇది ఇండియా-పాకిస్తాన్‌ కాదని మమతా తెలుసుకుంటే మంచిదని చెప్పారు. భారతదేశాన్ని రక్షించుకోవడానికి హిందువులు రెడీగా ఉన్నారని, మమతా బెనర్జీకి తగిన సమాధానం ఇస్తారని ప్రజ్ఞా ఠాకూర్‌ పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించడం తథ్యమని, బెంగాల్‌లో హిందూ రాజ్యం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. ఇక బెంగాల్‌లో తన హవా నడవదని గ్రహించారు కాబట్టే మమతలో అసహనం పెరిగిపోయిందని, ఉన్నదానికి లేనిదానికి కోపం తెచ్చుకుంటున్నారని ప్రజ్ఞా ఠాకూర్‌ అన్నారు.

Follow Us
పెట్రోల్, డీజిల్ ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
పెట్రోల్, డీజిల్ ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..