Crime News: మరి కాసేపట్లో ఇంటికి చేరుతారనగా రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల దుర్మరణం..
Ranga Reddy Road Accident: ఇద్దరు యువకులు ఇంటికి వెళ్లేందుకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మరి కాసేపట్లో ఇంటికి చేరుకుంటారనుకున్న ఇద్దరు యువకులపైకి కంటైనర్
Ranga Reddy Road Accident: ఇద్దరు యువకులు ఇంటికి వెళ్లేందుకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మరి కాసేపట్లో ఇంటికి చేరుకుంటారనుకున్న ఇద్దరు యువకులపైకి కంటైనర్ మృత్యువులా దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటన బుధవారం రాత్రి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్దార్‌నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..షాబాద్ నుంచి షాద్‌నగర్ వెళ్తున్న కంటెయినర్ అతివేగంగా వెళ్తూ బోల్తాకొట్టి దూసుకెళ్లింది. అనంతరం సమీపాన వెళ్తున్న స్కూటీపై పడింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు కూడా అక్కడికక్కడే మృతి చెందారు.
మృతి చెందిన యువకులు కక్కులూరుకు చెందిన ముట్పూరు విక్రాంత్ (19), పాపిరెడ్డిగూడేనొకొ చెందిన పవన్(18) గా గుర్తించారు. ఇద్దరు యువకులు కూడా మెకానిక్‌లుగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ పారిపోయాడని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: